
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించిన సినిమా 'మా ఇంటి బంగారం'. జూన్ 19న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా కలెక్షన్లు 2 మిలియన్ డాలర్లకు చేరువగా ఉన్నాయి. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో బుధవారం (జూన్ 25) మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సమంతతో పాటు చిత్ర బృందమంతా హాజరైంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చింది సమంత. ఇదే క్రమంలో రిలేషన్ షిప్స్, జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో అమ్మాయిలకు కీలకమైన సలహాలు ఇచ్చింది సమంత. 'మన కెరిర్ మన చేతుల్లో ఉంటుంది కానీ రిలేషన్ షిప్ అనేది మన కంట్రోల్ లో ఉండదు. కొన్నిసార్లు అది సంక్లిష్టంగా మారుతుంది. ముఖ్యంగా మహిళలు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు.. మీ విజయాన్ని చూసి ఈర్ష్య పడకుండా, గర్వంగా చెప్పుకునే, సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకునే వ్యక్తిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి' అని సమంత చెప్పుకొచ్చింది.
కాగా గతంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడింది సమంత. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
Our Bangaaram explains key takeaways from her role ❤️ Watch the BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM #MaaIntiBangaaram in theatres today ❤🔥 🎟️ @Samanthaprabhu2 #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah… — Tralala Moving Pictures (@TralalaPictures) June 25, 2026 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.