
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
ktr emotional Speech in chevella: తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం పీక్స్ కు చేరాయి. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా రాబోయే ఎన్నికల్ని టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచి క్యాడర్ కు దిశానిర్దేషం చేస్తుంది. తెలంగాణలో గతంలో పార్టీ అవలంబించిన పలు విధానాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాస్తంతో నిరుత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలో చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన తప్పిదాలు మరల జరగవన్నారు. తెలంగాణలో సర్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాల వంటి వారని చెప్పుకొచ్చారు. నాయకులు పార్టీ మారుతారు కానీ, కార్యకర్తలు మారరని తెల్చి చెప్పారు.
గతంలో వారికి సరైన విధంగా న్యాయం చేయలేక పోయిన మాట వాస్తవమన్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో అది జరగదన్నారు. తమ తప్పుల్ని అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ గెలుపుకోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈసారి కార్యకర్తలకు ఏవిధంగా గౌవరం ఇప్పించాలి.. వారిని గుండెల్లో చూసి పెట్టుకునే బాధ్యత తనదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా పదేళ్లు కొత్త ప్రభుత్వం పాలనపై టార్గెట్ చేసిందన్నారు.
2028 లో కేసీఆర్ ప్రజల దయతో సీఎం అవుతారన్నారు. నవ్వుకునే వారి ముందు జారీ పడవద్దని పాలన అందించామన్నారు. గతం మర్చిపోవాలని, తమ నుంచి ఇక మీదట తప్పిదాలు జరగవన్నారు. కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండు కూడా ఒక విధంగా ముందుకు తీసుకొని వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు రూ. కోటి పలికిన ఎకరం భూమి ప్రస్తుతం రూ.50-60 లక్షలకు కూడా కొనుగోలుదారులు దొరకని పరిస్థితి ఉందన్నారు. రియల్ ఎస్టేట్‌పై ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు.
Read more: Brs ktr: బడే భాయ్, ఛోటే భాయ్ కలిసి తెలంగాణను మోసం చేస్తున్నారు.!. షాకింగ్ నిజాలు బైటపెట్టిన కేటీఆర్..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఎన్నికల హామీలు నెరవెర్చలేదన్నారు. రైతు బంధు, దళిత బంధు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భీమా, మహిళలకు ఇచ్చిన హమీలు, అన్నింటికి పంగనామాలు పెట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ అరాచక పాలన నడుస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.