
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 14 బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుని.. ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటిన్నర ప్రమాద బీమాను అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే.. ఈ బీమా మొత్తం ఏకంగా రూ. 3 కోట్లకు పెరుగుతుంది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉచిత ప్రమాద బీమా, సమగ్ర ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బీమా కవరేజ్‌కు సంబంధించిన అవగాహన (MoU) ఒప్పందాలపై సంతకాలు చేసి పథకాన్ని ప్రారంభించారు. ఉద్యోగులు అడగక ముందే ప్రభుత్వం ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మొదటగా సింగరేణి కార్మికులకు బీమా కల్పించేందుకు డిప్యూటీ సీఎం ప్రతిపాదించినప్పుడు నమ్మకం కలగలేదని... కానీ ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల బీమా సొమ్మును అందించి ఇది సాధ్యమని నిరూపించారని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ స్పష్టం చేశారు. పీఆర్సీ విషయంలో ఇచ్చిన హామీని కూడా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.
నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి..
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గుంపు మేస్త్రీనే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరు అవహేళన చేసినా.. తాను పట్టించుకోనన్నారు. మంత్రవర్గమంతా తన గుంపే అన్న రేవంత్.. ఆ గుంపే తన బలమని స్పష్టం చేశారు. తనను సార్ అని పిలవొద్దతీ.. రేవంత్ అన్న అని పిలిస్తేనే ఇష్టమంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భద్రత, భరోసా కల్పించే లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వం లేదా ఉద్యోగులపై ఒక్క రూపాయి అదనపు భారం లేకుండా ఈ సరికొత్త ఉచిత బీమా పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోంది.ఈ పథకం ద్వారా సాధారణ ప్రమాదాల్లో మరణిస్తే రూ.1.25 కోట్ల బీమా రక్షణ, విమాన ప్రమాదం సంభవిస్తే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా పరిహారం అందనుంది. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా రక్షణతో పాటు ప్రమాదవశాత్తూ శాశ్వత సంపూర్ణ లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఆర్థిక అండ లభించనుంది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ రికార్డుల ద్వారా జీతం పొందే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక సిబ్బందికి కూడా ఈ పథకం సమానంగా వర్తించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..