
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో క్రికెటర్ శ్రీచరణి రికార్డు సృష్టించింది. ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచింది. ఈ సీజన్లో ఆమె ఇప్పటివరకు 12 వికెట్లు తీసింది.
పూనమ్ యాదవ్ 10 వికెట్లు (2020లో), డయానా డేవిడ్ 9 వికెట్లతో (2010లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు 21 ఏళ్ల శ్రీచరణి టీ20ల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే నంబర్‌వన్ బౌలర్‌గా అవతరించింది. ఐసీసీ తాజా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని, 753 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. T20WC.. శ్రీచరణి రికార్డు |