
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Khairatabad bada ganesh idol karra pooja begin: మన దేశంలో గణపయ్య ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుగుతాయి. ఇకహైదరబాద్ లో ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఇక్కడి బడాగణేష్ ను చూసేందుకు ఇతర ప్రాంతాల వారు కూడా ప్రజలు భారీగా తరలివస్తాయి. ప్రతి ఏటా నిర్జల ఏకాదశి రోజున ఖైరతాబాద్ బడా గణేష్ కర్రపూజను నిర్వహించి విగ్రహం తయారీ కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. ఈసారి కూడా నిర్జల ఏకాదశి నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ కర్రపూజను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు తదితరులు హజరయ్యారు. ఈ సారి ఖైరతాబాద్ గణపయ్య పంచముఖ సంకటహర మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ సారి 69 అడుగుల విగ్రహంను ప్రతిష్టించనున్నారు. వరుసగా 72వ సంవత్సరాలుగా నిర్వరామంగా ఖైరతాబాద్ గణపయ్య ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. పంచముఖ సంకటహర మహాగణపతి అవతారంలో గణపయ్యకి ఒక వైపు సోమనాథుడు, మరోవైపు కాళీ మాత విగ్రహాలు ఉంటాయి. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నమూనా పోస్టర్ ను విడుదల చేసింది. ఇక సెప్టెంబర్ 14 సోమవారం రోజున వినాయక చతుర్థి పండగను ఈసారి మనం జరుపుకుంటాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.