
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Man Ends life at Kannada actress Krishi thapanda residence: కన్నడ నటి , బిగ్ బాస్ ఫెమ్ కృషి తపండ నివాసంలో ఒక బిజినెస్ మెన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో కన్నడ నటి కృషి తపండా ఉంటున్న ఇంట్లో సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సూసైడ్ చేసుకున్న వ్యక్తిని వైశాఖ్ గా పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అతను డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు కూడా గుర్తించారు. వెంటనే అక్కడున్న సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు వైశాఖ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. గత వారం రోజులుగా ఆమె నివాసంలో వైశాఖ్‌ను ఉంటున్నాడు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
వైశాక్ కుటుంబ సమస్యలతో డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. నెల రోజులుగా తన భార్యకు దూరంగా నివసిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. గతంలో వ్యాపారవేత్త, న్యాయవాది అయిన అరవింద్ రెడ్డికి బెదిరింపు లేఖలు పంపడం తీవ్ర దుమారంగా మారింది.
ఇటీవల ఫిబ్రవరిలో, రూ. 6-7 కోట్లు ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రెడ్డికి కొరియర్ ద్వారా ఒక బెదిరింపు లేఖ పంపాడు. ఈ క్రమంలో అరవింద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా, ఒక మహిళకు సంబంధించిన వివాదం కారణంగా వైశాక్ ఆ లేఖను పంపాడనే ఆరోపణపై హెచ్ఏఎల్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఆ తర్వాత అతడిని విడుదల చేశారు. ఫిబ్రవరి 6న వైశాక్పై తదుపరి దర్యాప్తును కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. అంతకు ముందు అతడిని హెచ్ఏఎల్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించారు.
Read more: Venu Swamy: అందమైన అమ్మాయిల మొగుళ్లు తొందరగా చనిపోతారు.!. రచ్చగా మారిన వేణు స్వామి కామెంట్స్...
ఈ నేపథ్యంలో వైశాఖ్ సూసైడ్ పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరణానికి దారితీసిన కచ్చితమైన పరిస్థితులు బైటపడతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా నటి నివాసంలో వైశాఖ్ ఉరివేసుకుని చనిపోవడం కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర కలకలంగా మారింది. అసలు ఆమెకు, ఇతనికి ఉన్న రిలేషన్ ఏంటని కన్నడ నాట కొత్తచర్చలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.