
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
FIFA World Cup 2026: అట్లాంటాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ C మ్యాచ్‌లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించింది. రెండుసార్లు వెనుకబడినప్పటికీ పుంజుకున్న మొరాకో.. గ్రూప్ రన్నరప్‌గా నిలిచి ప్రపంచ కప్ రౌండ్ ఆఫ్ 32లో స్థానం సంపాదించింది. హైతీ అద్భుతంగా ఆరంభించి.. 10వ నిమిషంలో మొరాకోకు షాకిచ్చింది. జీన్-కెవిన్ డువర్నే పంపిన డేంజరస్ క్రాస్‌కు బాక్స్ లోపల లెన్నీ జోసెఫ్ వేగంగా స్పందించి.. గోల్ కీపర్ యాసిన్ బోనౌను దాటి బంతిని తలతో కొట్టి ఓన్ గోల్ చేశాడు. దీంతో హైతీ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 52 ఏళ్లలో ప్రపంచ కప్‌లో హైతీకి ఇదే తొలి గోల్ చేయడం విశేషం. స్కోరును సమం చేసే గోల్ కోసం మొరాకో తీవ్రంగా శ్రమించింది. చివరకు 39వ నిమిషంలో బిలాల్ అల్ ఖానౌస్ చేసిన ప్రయత్నాన్ని ప్రత్యర్థి గోల్ కీపర్ అడ్డుకోవడంతో బంతి తిరిగి వారి వద్దకు వచ్చింది. ఆ సమయంలో అష్రఫ్ హకీమీ సమీపం నుండి గోల్ చేసి మొరాకోకు విజయాన్ని అందించాడు.
మ్యాచ్ నాటకీయంగా సాగింది. బ్రేక్ కు కొద్దిముందు హైతీ మరో గోల్ చేసింది. 43వ నిమిషంలో విల్సన్ ఇసిడోర్ దూరం నుండి కొట్టిన అద్భుతమైన కర్లింగ్ షాట్‌తో హైతీ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. వెంటనే స్పందించిన మొరాకో.. అదనపు సమయంలో హకీమీ అందించిన కచ్చితమైన క్రాస్‌ను ఇస్మాయిల్ స్బిబారి గోల్‌గా మలిచి స్కోరును 2-2తో సమం చేశాడు. సెకండాఫ్ లో మొరాకో బంతిపై ఆధిపత్యం చెలాయించింది. దాదాపు 70 శాతం సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకుని అనేక అవకాశాలను సృష్టించుకుంది. కానీ హైతీ ఎక్కడా తొందరపడలేదు. బలంగా ఉంది. గోల్ కీపర్ జానీ ప్లాసిడ్ స్కోరును సమంగా ఉంచడానికి అనేక కీలకమైన సేవ్స్ చేశాడు. తమ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. గోల్ చేయడానికి మొరాకో వ్యూహాత్మక మార్పులపై ఆధారపడవలసి వచ్చింది.
దాదాపు 70వ నిమిషంలో సోఫియాన్ రాహిమి, గస్సిమ్ యాసిన్‌లకు ఛాన్స్ ఇవ్వడంతో ఆటలో కీలక మలుపు వచ్చింది.దీంతో పోటీ మరింత పెరిగింది. 78వ నిమిషంలో కార్నర్ నుండి వచ్చిన బంతిని అందుకుని రాహిమి వెంటనే గోల్ చేసి మొరాకోకు తొలిసారి ఆధిక్యాన్ని అందించాడు. హైతీ స్కోరును సమం చేయడానికి ముందుకు దూసుకెళ్తుండగా, 89వ నిమిషంలో మొరాకో ఎదురుదాడి చేసింది. ఈసారి, రాహిమి అందించిన అసిస్ట్‌తో గస్సిమ్ యాసిన్‌కు అద్భుతమైన లో కట్‌బ్యాక్ పాస్ అందగా, అతను ఖాళీ నెట్లోకి బంతిని పంపి మొరాకోకు 4-2 విజయాన్ని అందించాడు.
ఫిఫా వెబ్సైట్ ప్రకారం.. మొరాకో 22 షాట్లు కొట్టగా.. వాటిలో 11 టార్గెట్ రీచ్ అయ్యాయి. హైతీ కూడా బలమైన ప్రదర్శన కనబరిచి, టోర్నమెంట్లో గౌరవప్రదమైన స్థానాన్ని పొందింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.