
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Man Gives Bath To King Cobra Video Watch: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. వాటిలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి.. కానీ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం నెటిజన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. చూసేందుకే ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోలో.. ఒక యువకుడు ఏకంగా అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు వాటర్ గన్‌తో స్నానం చేయించాడు. ప్రస్తుతానికి ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బుసలు కొడుతున్న త్రాచు.. సాధారణంగా నాగుపాము పేరు చెబితేనే.. ఎవరైనా సరే ఆమడదూరం వెళ్లిపోతూ ఉంటారు. అలాంటిది ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.. ఒక పెద్ద నాగుపాము ముందు నిలబడిన ఒక యువకుడు, కారు వాష్ చేసేందుకు వాడే వాటర్ గన్ చేతపట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు.. అందులో నీళ్లు నింపి.. ఆ పాముపైకి చిమ్మడం మొదలు పెట్టాడు...
సాధారణంగా పాములు తమపైకి ఏదైనా వస్తువు వస్తున్నప్పుడు తీవ్రంగా స్పందిస్తూ ఉండడం మీరు ఇతర వీడియోల్లో చూసి ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది.. ఆ యువకుడు వాటర్ గన్‌తో నీళ్లు కొడుతుంటే, ఆ నాగుపాము కోపంతో ఊగిపోవడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. తన పడగ విప్పి, ఆ యువకుడిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడం మీరు గమనించవచ్చు. ఒక్కసారిగా ముందుకు దూకుతూ బుసలు కొట్టడం మీరు చూడొచ్చు. అయితే, ఆ యువకుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా.. చాలా చాకచక్యంగా వెనక్కి తప్పుకుంటూ మళ్లీ మళ్లీ దానిపై వాటర్ గన్‌తో నీళ్లు కొట్టడం మీరు గమనించవచ్చు.
నెటిజన్ల రియాక్షన్ ఇదే.. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్లోడ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్‌తో పాటు వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. యమధర్మరాజుతో ఇలాంటి ఆటలు వద్దు సోదరా.. ఒక్కసారి మిస్ అయితే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని ఒకరు కామెంట్ చేయగా.. వీడికి ధైర్యం ఎక్కువో.. లేక వ్యూస్ కోసం పిచ్చి ఎక్కువో అర్థం కావడం లేదంటూ మరికొందరు మండి పడుతున్నారు..
మరికొందరు మాత్రం ఆ పాముకు వేసవి కారణంగా ఎండ తీవ్రతతో పాటు వేడిమి తట్టుకోలేక నీళ్లు పోస్తున్నాడేమో అంటూ జోకులు పేలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ, కేవలం సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే స్టంట్లు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ వీడియోను kaka_caca_petualang అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటి వరకు 7 వేల మందికి పైగా లైక్ చేసిన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.