
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Frog Found in Ice Cream Video: వేసవి కాలంలోనో లేదా కాస్త చల్లదనం కోసమో ఐస్‌క్రీమ్ తినడం అందరికీ ఇష్టమే.. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పుల్ల ఐస్ (Ice Candy) అంటే ఎంతగానో ఇష్టపడి తింటూ ఉంటారు.. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం.. ఇకపై ఐస్‌క్రీమ్ తినే ముందు వంద సార్లు ఆలోచించాల్సిందే.. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఐస్‌క్రీమ్‌లో ఏకంగా ఒక చనిపోయిన కప్ప ప్రత్యక్షమైంది.. ఈ షాకింగ్ దృశ్యం ఇప్పుడు నెటిజన్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తింటుండగా బయటపడ్డ కప్ప.. వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే... ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్ కొనుక్కుని తింటున్నాడు. సగం ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత.. అతనికి అందులో ఏదో తేడాగా అనిపించింది. రంగు మారి, వింతగా కనిపిస్తున్న ఆ భాగాన్ని గమనించగా.. అది మరేదో కాదు.. ఐస్‌క్రీమ్‌తో పాటే గడ్డకట్టుకుపోయిన ఒక చిన్న చనిపోయిన కప్ప అని తేలింది. అంతేకాకుండా మీరు కూడా ఈ వీడియో ఆ చనిపోయిన నల్ల కప్పను చూడొచ్చు..
దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.. వెంటనే ఆ ఐస్ పుల్లను అక్కడే ఉన్న స్థానికులకు చూపించాడు. ఐస్‌క్రీమ్ మధ్యలో కప్ప కాళ్లు, శరీరం స్పష్టంగా కనిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు సైతం ఆశ్చర్యపోయిన్నట్లు తెలుస్తోంది.. ఇదేం ఘోరం.. ఇలాంటి ఐస్‌క్రీమ్‌లు తింటే ప్రాణాలు పోవాల్సిందేనా? అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడం వీడియోలో మీరు క్లియర్‌గా వినొచ్చు..
మరికొంతమందైతే.. ఇకపై బయట ఐస్‌క్రీమ్‌లు తినడమే మానేయాలని కామెంట్ చేయగా.. తయారీ కేంద్రాల్లో కనీస పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఇలాంటి కీటకాలు, జంతువులు ఐస్‌క్రీమ్ మిశ్రమంలో పడిపోతున్నాయని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాలలో ఎలుకలు, కప్పలు, పాములు రావడం ఎక్కువైపోవడంతో ప్రజలు బయట ఫుడ్ తినాలంటేనే జంకుతున్నారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం ఐస్‌క్రీమ్ ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. ఏదేమైనా.. బయట ఏ వస్తువు కొని తిన్నా.. కాస్త జాగ్రత్తగా చూసుకుని తినడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.