
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన అభ్యర్థుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ఈరోజు (గురువారం) మధ్యాహ్నం ఖచ్చితంగా 3 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన అభ్యర్థుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ఈరోజు (గురువారం) మధ్యాహ్నం ఖచ్చితంగా 3 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌ నికోలస్‌ ఈ రిజల్ట్స్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కందిమళ్ల లింగయ్య నిన్ననే (బుధవారం) ఒక ప్రకటన ద్వారా ఈ వివరాలను స్పష్టం చేశారు. విద్యార్థులు తమ పైచదువుల అడ్మిషన్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ అత్యంత వేగంగా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తోంది.రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం:ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు ఎలాంటి కంగారు పడకుండా తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులువుగా మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు.ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.హోమ్‌పేజీలో కనిపించే TG 10th Advanced Supplementary results June 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ఓపెన్ అయ్యే కొత్త విండోలో విద్యార్థి తన టెన్త్ సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.వివరాలు ఎంటర్ చేశాక సబ్‌మిట్ బటన్‌ నొక్కితే చాలు.. మీ మార్కుల మెమో స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. భవిష్యత్తు అడ్మిషన్ల అవసరాల కోసం దాన్ని పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవడం లేదా ప్రింట్ తీసుకోవడం మంచిది.AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాలు ఆ రోజే ? తాజా అప్డేట్..!విద్యార్థులకు ముఖ్య గమనిక:మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులంతా ఒకేసారి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడం వల్ల సర్వర్ కాస్త నెమ్మదించే (ట్రాఫిక్ సమస్య) అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు విద్యార్థులు ఆందోళన చెందకుండా, కొద్ది నిమిషాల పాటు వేచి చూసి పేజీని రీఫ్రెష్ చేస్తూ ఫలితాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు.TS EAPCET 2026: ఫలితాలు వచ్చేసాయ్! ర్యాంక్ కార్డ్స్ డౌన్ లోడ్ ఇలాఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఈ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. మార్చిలో జరిగిన రెగ్యులర్ పరీక్షల్లో అనుత్తీర్ణులైన (ఫెయిల్) విద్యార్థులతో పాటు, పాసైనప్పటికీ మార్కులు తక్కువగా వచ్చి స్కోర్ పెంచుకోవాలనుకున్న (ఇంప్రూవ్‌మెంట్) అభ్యర్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు.