
భార్యాభర్తల సంబంధం పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ, ఈ నమ్మకానికి కూడా పరిమితులు అవసరమని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే.. భార్య చెప్పింది కదా అని కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మి ఫాలో అయితే..
జీవితంలో ఊహించని చిక్కుల్లో పడి, మనసుకు కనీసం ప్రశాంతత కూడా లభించదు. మరి.. భార్య చెప్పినా కూడా వినకూడని విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...
చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తికి భౌతిక సంపద లేదా డబ్బుపై అత్యాశ ఉంటే, వారి ఆలోచనాతీరు సరిగా ఉండదు. మీ జీవితంలో వచ్చిన వ్యక్తికి డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉంటే.. వారు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మకూడదు. వారు అత్యాశతో మీతో తప్పులు చేయించే అవకాశం ఎక్కువ. దాని వల్ల ఫ్యూచర్ లో మీరే ఎక్కువ ఇబ్బందులు పడతారు.
మీ భార్య ముందు మాత్రం మీతో చాలా ప్రేమగా, స్వీట్ గా మాట్లాడి.. మనసులో మరో ఆలోచన పెట్టుకునే వ్యక్తి అయితే.. వారి మాటలను కూడా గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. వారి ఉద్దేశాలు వేరేలా ఉంటాయి. వారి మాటలు నమ్మి ఫాలో అయితే.. చివరకు మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
జీవితంలో దొరికన దానికి తృప్తిగా ఉండాలి. చాలా మంది మహిళలకు సంతృప్తి ఉండదు. ఎప్పుడూ అసంతృప్తితోనే ఉటారు. వీరి స్వభావం చంచలంగా ఉంటారు. తరచూ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమౌతారు. అసంతృప్తిగా ఉండే భార్య మీ జీవితంలో ఉంటే.. వారు మిమ్మల్ని తప్పు దారివైపు నడిపించే అవకాశం ఉంది. కాబట్టి.. వీరి మాటలు ఫాలో అవ్వకూడదు.
భార్యాభర్తల బంధం సరిగా ఉండాలి అంటే.. వారి కుటుంబ విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచాలి. చాణక్యుని ప్రకారం, కుటుంబ రహస్యాలు, ఆర్థిక స్థితి లేదా బలహీనతలను ఇతరులతో పంచుకునే అలవాటు ఉన్నవారికి అటువంటి సంభాషణలను అప్పగించకూడదు. అటువంటి చంచల స్వభావం మొత్తం కుటుంబానికి సమస్యలను సృష్టించగలదు.