
Platform 65 Food Safety Raids: ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ నిర్వాహకులను తీవ్రంగా హెచ్చరించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి జోన్ పరిధిలో ఉన్న సుమారు అరవై హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిత్యం వేలాది మంది కస్టమర్లతో బిజీగా ఉండే ప్రముఖ హోటళ్లలో జరిగిన ఈ రైడ్స్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాట్‌ఫారమ్ 65 హోటల్లో ఆహారాన్ని వండే కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు, వ్యర్థాలతో డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఫ్రీజర్లలో