
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు దీరి రెండేళ్ల పూర్తైయింది. ఈ నేపథ్యంలో పలు కార్పోరేషన్స్కు కొత్తగా చైర్మన్లను నియమించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భరత్ భూషణ్.. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటూ.. ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా పరిశ్రమని అభివృద్ది దిశలో నడిపిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చంద్రబాబు నాయుడు అందిస్తున్న సహాకారం మరవలేనిదన్నారు.
హైదరాబాద్‌తో పాటు అమరావతిలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ది చెందేలా APSFTVTDC ప్రభుత్వంతో కలిసి తమ టీమ్ కలిసి కృషి చేస్తుందని సీఎంకు వివరించామన్నారు. అలాగే తాను APSFTVTDC చైర్మన్ అయిన తరువాత రేపు వెంకటపాలెం తిరుమల తిరుపతి దేవస్తానం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరగనున్న #NBK112 చిత్ర ప్రారంభోత్సవం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు నారా లోకేష్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిధులుగా హాజరు కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగేలా మా టీంతో కలిసి కృషి చేస్తామన్నారు. రేపు ఉదయం బాలకృష్ణ, కొరటాల శివ సినిమా ఎంతో అట్టహాసంగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.