
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఇన్సూరెన్స్ పథకం ఒక్కొక్క ఉద్యోగికి 1.20 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తం కోటి 20 లక్షల మంది
ఉద్యోగులకు వర్తింపు Telangana Employees : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్న్యూస్ చెప్పింది. ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన ‘ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్’ను జూన్ 25న అధికారికంగా ప్రారంభించనుంది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కూడా హాజరుకానున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్కొక్కరికి రూ.1.20 కోట్ల వరకు జీవిత బీమా రక్షణ లభించనుంది. ఉద్యోగి లేదా పెన్షనర్ సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణించినా వారి కుటుంబ సభ్యులకు ఈ బీమా మొత్తం అందుతుంది. Read Also : TGSRTC Offer : బస్టాండ్లలో షాపులు పెట్టేవారికి టీజీఎస్ఆర్టీసీ గోల్డెన్ ఛాన్స్.. ఈ పథకంలో ప్రత్యేకత ఏమిటంటే.. లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు. ఉద్యోగుల తరఫున బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. మొత్తం కోటి 20 లక్షల మంది ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తింపు చేయనుంది. ఈ ఇన్సూరెన్స్ పథకం అమలుకు పారదర్శకత సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బీమా సంస్థలు, ప్రముఖ బ్యాంకులతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా క్లెయిమ్ ప్రాసెస్ వేగవంతం కానుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బీమా సొమ్ము జమ అవుతుంది. ఉద్యోగులు, పెన్షనర్ల ఫ్యామిలీలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ తీసుకువస్తోంది.