
Jampanna Vagu: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామం దగ్గర జంపన్న వాగుపై నిర్మించిన లో లెవెన్ వంతెన వర్షానికి కొట్టుకుపోయింది. 2023లో రూ.
16 కోట్లతో ప్రారంభించిన వంతెన పనులు పిల్లర్ల దశలో నిలిచిపోయాయి. ఇటీవల 60 లక్షల రూపాయలతో నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన తాత్కాలిక లో లెవెల్ వంతెన పైపులతో సహా వరద ఉదృతికి కొట్టుకుపోయింది. కొండాయి, మల్యాల, ఐలాపూర్ గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.