
School Holidays In Telugu States On June 26: విద్యార్థులకు ఎంతో సంతోషకరమైన వార్త.. ఎల్లుండి మళ్ళీ పాఠశాలలకు సెలవు లభించనుంది. వేసవి సెలవులు ముగిసిన కొద్ది రోజుల్లోనే వరుసగా సెలవులు వస్తున్నాయి.
ఎల్లుండి జూన్ 26న మొహర్రం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేపు 25వ తేదీ కూడా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
తెలుగు విద్యార్థులకు ఇది సూపర్ గుడ్ న్యూస్. ఎల్లుండి మళ్ళీ స్కూళ్లకు సెలవు రానుంది. రేపు ఒక్కరోజు స్కూల్‌కి వెళ్లాల్సి వస్తుంది. శుక్రవారం జూన్ 27వ తేదీ మొహర్రం సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
అదే సమయంలో మరుసటి రోజు జూన్ 28వ తేదీన నాలుగో శనివారం కూడా ఉంది. ఆరోజు కూడా సెలవు ఇస్తే శుక్ర, శని, ఆదివారాలు వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ ట్రిప్ ఎంజాయ్ చేయవచ్చు. మూడు రోజుల పాటు ఎక్కడైనా ఫ్యామిలీతో కలిసి గడపడానికి ఈ అవకాశం లభిస్తుంది.
మరోవైపు, శనివారం చాలా స్కూళ్లకు హాఫ్ డే మాత్రమే ఉంటుంది. సగం రోజు పిల్లలు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఆదివారం వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి లాంగ్ వీకెండ్‌కు వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా ఇది మంచి సమయం. చిన్నపాటి వర్షాలు కురుస్తున్న తరుణంలో ఇది కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది.
మొహర్రం సందర్భంగా కేవలం స్కూళ్లే కాకుండా, ఇతర విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా మూసివేసి ఉంటాయి. బ్యాంకులకి నాలుగో శనివారం ఎలాగో సెలవు కాబట్టి, మరుసటి రోజు ఆదివారంతో కలిపి వాటికి కూడా వరుసగా మూడు రోజులు సెలవు వస్తుంది.
ఇక ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల అయిన మొహర్రం ముస్లింలు జరుపుకుంటారు. పదవ రోజున దీనిని ఆచరించడం ఒక ఆచారంగా ఉంది. షియా ముస్లింలకు మొహర్రం ఒక సంతాప దినం, సున్నీ ముస్లింలు ఈ రోజున ఉపవాసాలు ఉంటారు. ఈ రోజున వీరు సంతాప ఊరేగింపులు కూడా నిర్వహిస్తారు.