
Jampanna Vagu Flood Rescue Video: ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో యువకుడి ప్రాణాలను కాపాడేందుకు గ్రామస్తులు సాహసం చేశారు. గ్రామ సమీపంలోని జంపన్నవాగు భారీ వర్షాలతో పొంగిపొర్లుతుండగా..
తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేష్ అనే యువకుడిని ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక గజ ఈతగాళ్లు తెప్పను ఏర్పాటు చేసి.. యువకుడిని దానిపై పడుకోబెట్టి ప్రాణాలకు తెగించి వాగు దాటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామస్తులు మరోసారి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.