ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు సూర్యకాంతిలో ఉండండి. దీని వల్ల సిర్కాడియన్ రిథమ్ బాగుంటుంది. 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉంటే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు.
ఉదయం పూట ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినండి. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. కార్బోహైడ్రేట్స్, చక్కెర పదార్ధాలకు దూరంగా ఉండండి.
అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని తినండి. విటమిన్ డి, విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఉన్న ఆహారాలు తినండి. ఇవి ఎనర్జీ పెంచుతాయి.
మధ్యాహ్నం పూట ఎనర్జీ డ్రింక్స్, స్వీట్స్‌కు దూరంగా ఉండండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి మగతకు కారణం అవుతాయి. ఎనర్జీ డ్రింక్స్‌కు బదులుగా పండ్లు, నట్స్ తినండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎండార్పిన్లు రిలీజ్ అవుతాయి. సరదాగా ఉండొచ్చు. వ్యాయామం చేస్తే కణాలు ఆరోగ్యంగా మారుతాయి.
కాఫీ తాగడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. అయినప్పటికీ కాఫీ తాగితే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. నిద్రలో ఆటంకం కలుగుతుంది. దీంతో శక్తి స్థాయిలు తగ్గుతాయి.
డీహైడ్రేషన్ వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. పుష్కలంగా నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి మాయం అవుతుంది.
రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. 8 గంటల నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరం రిపేర్ అయ్యేందుకు సమయం లభిస్తుంది. దీంతో ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు.
ప్రతిరోజూ ఉదయం ధ్యానం, డీప్ బ్రీతింగ్ వంటివి చేయండి. వీటి వల్ల ఒత్తిడి మొత్తం మాయం అవుతుంది.