
పిల్లలు చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకున్నట్లే సామాజిక నైపుణ్యాలు కూడా నేర్చుకోవాల్సిందే. ఇవి సహజంగా వచ్చేయవు. ఇంట్లో, పాఠశాలలో, స్నేహితులతో కలిసిమెలిసి ఉండే సమయంలో క్రమంగా అభివృద్ధి చెందుతాయి.
ముఖ్యంగా 10 ఏళ్ల వయసు వచ్చే సమయానికి ఈ నైపుణ్యాలు పిల్లల వ్యక్తిత్వంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. స్నేహితులతో కలవడం, భావాలను చెప్పడం, విభేదాలను ఎదుర్కోవడం వంటి విషయాల్లో ఇబ్బంది పడితే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది.1. కొత్త గ్రూపులో కలవడంచాలా మంది పిల్లలకు కొత్తగా ఉన్న పిల్లల గుంపులోకి వెళ్లి మాట్లాడటం పెద్ద సవాలుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఎలా చేరువ కావాలో నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ముందుగా ఆ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించడం, తర్వాత సంభాషణలో భాగం కావడం అలవాటు చేయాలి. ఇలా చేస్తే కొత్త స్నేహాలు చేయడం సులభమవుతుంది.2. విభేదించినా స్నేహాన్ని కొనసాగించడంచిన్న చిన్న గొడవలను కూడా కొందరు పిల్లలు చాలా పెద్ద విషయంగా తీసుకుంటారు. స్నేహం ముగిసిపోయిందని భావిస్తారు. కానీ ప్రతి విషయంలో ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వేరే అభిప్రాయం ఉన్నా పరస్పర గౌరవంతో మాట్లాడటం నేర్పించాలి. ఇది భవిష్యత్తులో సంబంధాలను బలంగా ఉంచుతుంది.3. మాటలతో పాటు సంకేతాలుఎదుటివారి ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా విషయాలు చెబుతాయి. ఎవరైనా ఆసక్తి కోల్పోయినప్పుడు, అసౌకర్యంగా ఉన్నప్పుడు లేదా సంభాషణ ముగించాలని అనుకుంటున్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం పిల్లలకు నేర్పిస్తే ఇతరులతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు.4. కష్టమైన సమయంలోచాలా