
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Bigg Boss 10 Agnipariksha Audition: తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ క్రేజీ సంపాదించుకున్న రియలిటీ షో బిగ్ బాస్. త్వరలోనే సరికొత్త మైలురాయని అందుకుని పదవ సీజన్లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు 9 సీజన్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మెగా షో ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈసారి షో మరింత ఎంటర్టైనింగ్గా మార్చేందుకు నిర్వాహకులు భారీ ప్లానింగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సామాన్లకు హౌస్ లోకి వెళ్లేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించారు.
సాధారణంగా సెలబ్రిటీలతో నిండిపోయే బిగ్ బాస్ హౌస్ లో సామాన్యులకు చూడదగ్గ ఓ అద్భుతమైన విషయంగా మారుతుంది. గత సీజన్లో కామన్ మ్యాన్ కేటగిరీ కింద అడుగుపెట్టిన కంటెస్టెంట్ హౌస్ లోనే తన సత్తా చాటడం కాకుండా ప్రేక్షకుల ఆదరణతో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. దీంతో పదో సీజన్ కూడా కామన్ మ్యాన్ కు పెద్దపీట వేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
గత సీజన్లో సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి అవకాశం కల్పించేందుకు నిర్వహించిన అగ్నిపరీక్ష కాన్సెప్ట్ విజయవంతం కావడంతో ఈసారి మరింత పకడ్బందీగా 'బిగ్ బాస్ అగ్ని పరీక్షా సీజన్ 2' కూడా లాంచ్ చేశారు. ఆన్లైన్ ద్వారా ఇప్పటికే జూన్ 12 నుంచి జూన్ 20 వరకు గడువు ఇచ్చారు వచ్చిన వేలాది దరఖాస్తులను పరిశీలించిన డిజిటల్, ఆన్‌గ్రౌండ్ సెలెక్షన్లలో గెలిచిన దాదాపు 5 మంది సామాన్యులను మైల్ స్టోన్ సీజన్ 10 హౌస్ లోకి నేరుగా ఎంట్రీ లభించనుంది.
ఒకవేళ 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్స్ మిస్ అయినవారికి తాజాగా సర్ప్రైజ్ ఇచ్చారు నిర్వాహకులు. 'బిగ్‌బాస్ తెలుగు 10'కి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వైట్ గోల్డ్ సంస్థతో కలిసి ఈసారి కొత్త కాంటెస్ట్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రోమో ప్రముఖ యాంకర్ శ్రీముఖి విడుదల చేసింది.
"బిగ్‌బాస్ 10 అగ్ని పరీక్ష ఆడిషన్ వీడియో సబ్మిట్ చేయడం మిస్ అయ్యారా? మీకోసం మరో గోల్డెన్ ఛాన్స్" అంటూ ఆ వీడియో ప్రారంభం అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు వారు ఇచ్చిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ ఆడిషన్ వీడియోను సబ్మిట్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఇది అగ్ని పరీక్ష రౌండ్లోకి వెళ్లడానికా లేదా నేరుగా సామాన్యుడి కంటెస్టెంట్‌గా ఎంపిక చేయడానికా అనేది తెలియాల్సి ఉంది.
ఈ ప్రతిష్టాత్మక పదో సీజన్ కోసం సెలబ్రిటీలు, సామాన్యుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం తుదిదశకు చేరుకుతుంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే ఈ సరికొత్త సీజన్ ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో అత్యంత వైభవంగా ప్రారంభం కానట్లు సమాచారం. ఏదేమైనా ఒక సామాన్యుడిగా వచ్చి బిగ్ బాస్ ట్రోఫీ గెలవాలనుకునే మాత్రం ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.