
ఇంట్లో బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం చెప్పే సంకేతాలు ఇవే!ఇంట్లో బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం చెప్పే సంకేతాలు ఇవే!
24 June 2026 Rajashekher సాంప్రదాయ నమ్మకాల ప్రకారం బల్లి లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉందని భావిస్తారు. ఇంట్లో తరచూ బల్లి కనిపించడం సంపద, శ్రేయస్సుకు సంకేతంగా చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నం ప్రతిరోజూ ఇంటి అటకపై బల్లి కనిపిస్తే కుటుంబంలో సానుకూల మార్పులు, ఆర్థిక పురోగతి చోటుచేసుకుంటాయని నమ్మకం. అటకపై బల్లి సంచారం శుభప్రదం దేవాలయం లేదా పూజ గదిలో బల్లి కనిపించడం దైవ అనుగ్రహం, శుభఫలితాలకు సంకేతంగా పరిగణిస్తారు. పూజ గదిలో బల్లి దర్శనం అదృష్ట సూచకం ఇంట్లో బల్లి తరచూ కనిపించడం లేదా అకస్మాత్తుగా దృష్టికి రావడం ఆర్థిక సమస్యలు తగ్గి మంచి రోజులు ప్రారంభమవుతాయని కొందరు విశ్వసిస్తారు. ఆర్థిక కష్టాలు తొలగే అవకాశం కొన్ని నమ్మకాల ప్రకారం కలలో బల్లి కనిపించడం జీవితంలో ఎదురయ్యే సవాళ్లు లేదా అనుకోని సంఘటనలకు సంకేతంగా భావిస్తారు. కలలో బల్లి కనిపిస్తే హెచ్చరిక బల్లి గోడపై అసాధారణంగా వేగంగా సంచరిస్తే ఆర్థిక వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలనే సూచనగా పరిగణిస్తారు. గోడపై వేగంగా పరుగెత్తే బల్లి గోడపై రెండు బల్లులు ఒకదానితో ఒకటి పోరాడుకుంటూ కనిపిస్తే కుటుంబంలో విభేదాలు లేదా కలహాలు తలెత్తే అవకాశముందని నమ్మకం. రెండు బల్లులు పోరాడుకోవడం ఇంట్లో చనిపోయిన బల్లి కనిపించడం ప్రతికూల పరిస్థితులు లేదా దురదృష్టానికి సంకేతంగా కొన్ని వాస్తు విశ్వాసాలు పేర్కొంటాయి. చనిపోయిన బల్లి కనిపిస్తే ఇంటి ప్రధాన ద్వారం లేదా ముందు తలుపు దగ్గర బల్లి కనిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ధనలాభం, శుభవార్తలు లేదా కొత్త అవకాశాలకు సూచనగా చెబుతారు. అయితే, వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. ప్రధాన ద్వారం వద్ద బల్లి కనిపిస్తే మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్