
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఎదిగిన 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ జీవితంలో ఒక అపురూపమైన మైలురాయి ఆవిష్కృతమైంది.
ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత సీనియర్ జట్టుకు తొలిసారి ఎంపికైన వైభవ్.. తాజాగా తన పేరు ముద్రించి ఉన్న అధికారిక బ్లూ జెర్సీని అందుకున్నాడు. జెర్సీపై తన పేరును చూసుకున్న వైభవ్ మాటలు రాక, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ సృష్టించిన పరుగుల విధ్వంసమే అతడికి ఈ చారిత్రాత్మక అవకాశాన్ని తెచ్చిపెట్టింది. టోర్నమెంట్లో ఎవరూ ఊహించని విధంగా 237కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు పలు వ్యక్తిగత అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో భారత సీనియర్ జట్టుకు పిలుపు అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట దశాబ్దాలుగా ఉన్న రికార్డును ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ బద్దలు కొట్టాడు. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌లో ప్రారంభం కానున్న టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. వైభవ్ ఎంపికపై టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. ఐపీఎల్ అద్భుతంగా ఆడిన వైభవ్.. ఇండియా-ఏ జట్టు ఆడిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లొ 94 పరుగులో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడని గుర్తుచేశాడు. ఈ ప్రదర్శనతో వైభవ్‌ను పక్కన పెట్టే ఆప్షన్ సెలెక్షన్