
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌తో తొలి టీ20లో భారత్ కష్టాల్లో పడింది. అప్పుడే సగం వికెట్లను కోల్పోయింది. ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 11 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 96...
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌తో తొలి టీ20లో భారత్ కష్టాల్లో పడింది. అప్పుడే సగం వికెట్లను కోల్పోయింది. ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 11 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజ్‌లో సుందర్ (6*), శివమ్ దూబే (5*) ఉన్నారు. అంతకుముందు తిలక్ వర్మ (19) మాథ్యూ బౌలింగ్‌లో రాస్ అడైర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. భారత్ విజయానికి ఇంకా 54 బంతుల్లో 87 పరుగులు అవసరం.
ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (50: 20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. 19 బంతుల్లో అతడు అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే, ఆ తర్వాత బంతికే భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 8 ఓవర్లకు 80/4. టీమ్ఇండియా విజయానికి ఇంకా 72 బంతుల్లో 103 పరుగులు అవసరం.
భారత్‌కు స్వల్ప వ్యవధిలో షాక్ తగిలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూ బౌలింగ్‌లో (5.1వ ఓవర్) శ్రేయస్ షాట్ కొట్టగా డీప్ స్క్వేర్‌లో జార్జ్ డాక్రెల్ క్యాచ్‌ను అందుకొన్నాడు. దీంతో 60 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను నష్టపోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ స్కోరు 6 ఓవర్లకు 68/3. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (47*), తిలక్ వర్మ (8*) ఉన్నారు. టీమ్ఇండియా విజయానికి ఇంకా 84 బంతుల్లో 115 పరుగులు అవసరం.
తొలి టీ20లో ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనకు భారత్ దిగింది. అయితే, రెండో ఓవర్ తొలి బంతికే టీమ్ఇండియా వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ సంజు శాంసన్ (5)ను ఐర్లాండ్ బౌలర్ మూండ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. అంతకుముందు మాథ్యూ వేసిన తొలి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. వికెట్ పడినా అభిషేక్ శర్మ (46*) మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. బౌండరీలతో ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మెక్‌కార్తీ వేసిన మూడో ఓవర్లో నాలుగు ఫోర్లు సహా 21 పరుగులను రాబట్టాడు. అయితే, నాలుగో ఓవర్లో రెండో బంతికి ఇషాన్ కిషన్ (1)ను మాథ్యూ ఔట్ చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 ఓవర్లకు 57/2. క్రీజ్‌లో అభిషేక్ శర్మతోపాటు శ్రేయస్ అయ్యర్ (1*) ఉన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా జరిగిన టీ20 లీగ్ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్‌ను నల్గొండ నైట్స్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో నల్గొండ 259/5 స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వరంగల్ 14 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దీంతో వరంగల్‌పై 91 పరుగుల తేడాతో నల్గొండ ఘన విజయం సాధించింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..