
ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లా పోలీసులు అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒకే రోజు 766 గ్రామాల్లో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో (Golden Book of World...
ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లా పోలీసులు అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒకే రోజు 766 గ్రామాల్లో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో (Golden Book of World Records) చోటు దక్కించుకున్నారు. రోడ్డు ప్రమాదాల్లో నష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ వినియోగాన్ని ప్రోత్సహించేలా పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి సోనాల్ రాజేశ్ శర్మ.. ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్, పోలీసు ఉన్నతాధికారులకు వరల్డ్ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రం, మెడల్ అందజేశారు.
బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని 766 గ్రామాల్లో సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. దాదాపు 5000 మంది వాలంటీర్లు ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. రహదారి భద్రత గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ క్యాంపెయిన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగం గురించి అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 18న దాదాపు 10 వేల మందితో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి విశేష స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సహా పలువురు ప్రముఖులు వీడియో సందేశాలు పంపారు. ఆ స్ఫూర్తితోనే జిల్లా పోలీసు యంత్రాంగం ఈ అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గుడీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సందడి చేసింది.