
Pune fort murder| ఇంటర్నెట్‌డెస్క్: పుణె బిజినెస్‌మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది (Ketan Agarwal Murder Case).
లోహ్‌గఢ్ కోటలో కేతన్‌ను హత్య చేయాలని సియాను ఆమె ప్రియుడు చేతన్ ప్రేరేపించాడని.. లేదంటే జూన్ 14న అతడిని అంతమొందించడానికి ప్రయత్నించిన విషయాన్ని బయటపెడతానని బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. ప్లాన్ ప్రకారం కొండ అంచు వద్దకు చేరుకున్నాక సియా.. అతడికి సంకేతం ఇచ్చిందన్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న చేతన్.. కేతన్‌ను వెనక నుంచి తోసేసినట్లు వెల్లడించారు.
హత్యకు సియాను ప్రేరేపించడానికి చేతన్ తమ ప్రైవేట్ ఫొటోలు, కాల్ రికార్డింగ్స్ బయటపెడతానని బెదిరించాడా ..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. హత్యకు ముందు రోజు సియా-చేతన్ ఓ కేఫ్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్న సీసీటీవీ దృశ్యాలు దొరికాయి. ఈ కేసులో సియా గోయల్ సోదరుడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
సియా తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు తన కుమార్తెకు కోటకు వెళ్లడమే ఇష్టం లేదని.. కేతన్ తల్లి బలవంతంగా ఒప్పించడంతో ట్రెక్కింగ్‌కు వెళ్లిందని పేర్కొన్నారు. తన కుమార్తె ఇంతటి దారుణానికి పాల్పడుతుందని తాను అనుకోవట్లేదన్నారు. సియానే నేరం చేసినట్లు తేలితే ఆమెకు మరణ శిక్ష విధించాలని.. లేదంటే అదే కోట పైనుంచి తోసేయాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గుడీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సందడి చేసింది.