
Prabhas Anushka:దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా విడుదలై చాలా సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ప్రభాస్, అనుష్క, రానా కలిసి కనిపించారు. చాలా కాలం తర్వాత ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో వారు బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సరదా సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభాస్, అనుష్క గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడినంతసేపు.. స్వీటీ, స్వీటీ అని పిలవడంతో.. ప్రభాస్ అనుష్కన స్వీటీ అని పిలుస్తారని అందరికీ అర్థమైపోయింది. అలాగే ప్రభాస్ అనుష్క విషయంలో ఒక్క దాని గురించి మాత్రం భయపడతాను అంటూ చెప్పారు. షూటింగ్ సమయంలో ఆమె నవ్వడం మొదలుపెడితే చాలా సేపు ఆపకుండా నవ్వుతూనే ఉండేదని చెప్పారు. కొన్నిసార్లు దాదాపు 45 నిమిషాల పాటు ఆమె నవ్వుతూనే ఉండేదని సరదాగా గుర్తు చేసుకున్నారు.
అందుకే ప్రతి రోజు షూటింగ్‌కు వెళ్లే ముందు స్వీటీ ఈరోజైనా నవ్వకూడదని అనుకునేదని ప్రభాస్ నవ్వుతూ చెప్పారు. ఒకసారి ఆమె నవ్వడం మొదలైతే షూటింగ్ ఆగిపోతుందని, భారీ సెట్లు వేసిన నిర్మాతలకు కూడా ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అందుకే ఆ విషయంలో తనకు అనుష్క అంటే కొంచెం భయం ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియోలో రానా దగ్గుబాటి కూడా బాహుబలి షూటింగ్ రోజుల గురించి కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు. అలాగే సత్యరాజ్ కూడా ఆ సినిమా కోసం ఏర్పాటు చేసిన భారీ సెట్లు, వందలాది కాస్ట్యూమ్స్ చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.
ఇక బాహుబలి ప్రపంచానికి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మరోసారి బాహుబలి టీమ్‌ను కలిసి చూడబోతున్నామనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.