
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana IAS Officers Transfers: పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారులకు స్థాన చలనం కల్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మారిన రోజే ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన శాఖలకు సంబంధించిన అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి అధికారుల మార్పులు చేర్పులు జరిగాయి. 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ జరగ్గా ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేవాదాయ శాఖ నుంచి బదిలీ తెలంగాణలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు జరిగాయి. 13 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు ప్రభుత్వం ఇచ్చింది. జీఓ ఆర్టీ నంబర్ 914ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ నియమితులవగా.. దేవాదాయ శాఖ నుంచి ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖకు శైలజా రామయ్యర్ బదిలీ అయ్యారు. ఇక పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్ పోస్టింగ్ లభించింది.
రాహుల్ బొజ్జాకు స్థాన చలనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియామకం కాగా.. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీజీఆర్‌ఈడీసీఓ వీసీ, ఎండీగా ముషర్రఫ్ అలీ ఫారూఖీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. హ్యాండ్లూమ్స్, టెక్ట్స్‌టైల్స్ స్పెషల్ సీఎస్‌గా పి. కాత్యాయిని దేవి నియమితులవగా.. టీజీఆర్‌ఈఆర్‌ఏ ఈడీ కె. గంగాధర్‌కు ఆర్ అండ్ బీ శాఖలో పోస్టింగ్ లభించింది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా టి. వెంకన్న బదిలీ కాగా.. టూరిజం డైరెక్టర్‌గా కె. విద్యాసాగర్ నియామకం అయ్యారు. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కే. చంద్రకళకు ఎఫ్ఏసీ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది.
అదనపు బాధ్యతలు మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శిగా ఎం. రఘునందన్ రావుకు పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించగా.. టీజీ ట్రాన్స్‌కో వీసీ,ఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీకి ఎఫ్ఏసీ బాధ్యతలు ప్రభుత్వం ఇచ్చింది. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా విద్యాసాగర్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వగా.. శంషాబాద్ జోనల్ కమిషనర్ కె. చంద్రకళకు హెచ్ఎండీఏలో ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చింది. కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితులైన సంజయ్ జాజుకి అదనపు బాధ్యతల కొనసాగింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు సంజయ్ జాజుకే సీఎస్‌గా అవకాశం ఇచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ అదనపు బాధ్యతలు కొనసాగించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా కూడా సంజయ్ జాజు కొనసాగనున్నారు. స్పీడ్ వ్యవస్థ బాధ్యతలు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దే ఉన్నాయి.