
సెయింట్ లూయిస్: ‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా సెయింట్ లూయిస్లోని మహాత్మా గాంధీ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది.
సమాజ సేవలో భాగంగా మిస్సోరి నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో నాట్స్ మెడికల్ డైరెక్టర్, అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డా.సుధీర్ అట్లూరి తన విలువైన సేవలు అందించారు.
రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమ నిర్వహణలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ నేషనల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర కీలక పాత్ర పోషించారు. మిస్సోరి చాప్టర్ బృందంతో పాటు వాలంటీర్లు ఎంతో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి ఈ శిబిరం విజయవంతం కావడంలో తమ వంతు కృషి చేశారు. వైద్య శిబిరంలో సేవలందించిన ప్రతి ఒక్కరికీ నాట్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.