నిమ్మకాయలో సహజ యాసిడ్ గుణాలు ఉంటాయి. ఇవి మరకలు తొలగిస్తాయి. నిమ్మకాయ స్క్రబ్‌తో క్లీన్ చేస్తే దుర్వాసన కూడా తగ్గుతుంది.
బాత్రూమ్ క్లీన్ చేసేందుకు ఉపయోగించే నిమ్మకాయ స్క్రబ్ తయారీ కోసం బేకింగ్ సోడా, నిమ్మకాయలు, ఉప్పు, స్పాంజ్ లేదా బ్రష్ కావాలి.
తాజా నిమ్మకాయలను పిండి, ఆ రసాన్ని అంతటినీ ఒక గిన్నెలో వేసుకోండి.
ఈ నిమ్మకాయ రసంలో కొంచెం బేకింగ్ సోడాను వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి.
ఈ మిశ్రమంలో కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. ఉప్పు మొండి మరకలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ మిశ్రమాన్ని వాష్ బేసిన్, ట్యాప్స్ పైన రుద్ది కాసేపు వెయిట్ చేయండి. కొన్ని నిమిషాల తర్వాత నీటిలో కడిగితే మరకలు పోతాయి.
కుళాయిలు, షవర్ ఫిట్టింగ్స్పై ఈ స్క్రబ్ రాయండి. కాసేపు తర్వాత రబ్ చేస్తే మెరుపు వస్తుంది.
ఈ స్క్రబ్ బాత్రూమ్ టైల్స్‌పై ఉన్న సబ్బు మరకలు కూడా తొలగిస్తుంది. గోడలపై పేరుకుపోయిన మురికి, సబ్బు మరకలు కూడా తొలగుతాయి.
స్క్రబ్ చేసిన ప్రదేశాలన్నింటినీ శుభ్రంగా నీళ్లతో కడగండి. వారానికి ఒకసారి దీనిని రిపీట్ చేయండి. దీంతో దుర్వాసన ఉండదు.