
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CPO POST: కార్పొరేట్ ప్రపంచంలో ఒక సరికొత్త పదవి ప్రాచుర్యం పొందుతోంది. అదే చీఫ్ పర్పస్ ఆఫీసర్. ఈ పేరు వినేందుకు కొంచెం వింతగా అనిపించినా.. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు దీనిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. యూబిసాఫ్ట్, వర్జిన్ అట్లాంటిక్, సిస్కూ, సెఫోరా, కేపీఎంజీ వంటి కంపెనీలు ఇప్పటికే ఇలాంటి చాలా పదవులను స్రుష్టించాయి. అసలు ఈ సీపీఓ అంటే ఏమిటి. కంపెనీలకు ఈ పోస్టు నిజంగా అవసరమా. సీపీఓ పోస్టు సాధించాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం.
కార్పొరేట్ ప్రపంచంలో ప్రపంచాన్ని మారుస్తాం అంటూ కంపెనీలు చేసే ప్రకటనలు చాలావరకు నినాదాలకే పరిమితమవుతుంటాయి. రోజువారీ టార్గెట్లు, లాభాల ఒత్తిడిలో ఆ గొప్ప ఆశయాలు మరుగునపడిపోతాయి. ఇలాంటి సమయంలో కంపెనీ మాటలకు, చేతలకు మధ్య వారధిగా పనిచేసే కీలక పదవే చీఫ్ పర్పస్ ఆఫీసర్.
CPO బాధ్యతలేంటి? కంపెనీ వ్యూహాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతల మధ్య సమతుల్యం సాధించడమే CPO ప్రధాన విధి. బోర్డు సమావేశాల్లో ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. ఈ నిర్ణయం మన దీర్ఘకాలిక విలువలకు అనుగుణంగా ఉందా? లాభాల కోసం మనం విలువలతో రాజీ పడుతున్నామా? అని కఠినమైన ప్రశ్నలు అడగడం వీరి పని. కేవలం టార్గెట్లకే కాకుండా.. కంపెనీ నిర్దేశించుకున్న సామాజిక లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే ఉద్యోగులకు ప్రతిఫలాలు అందేలా వీరు రిక్రూట్మెంట్, జీతభత్యాల వ్యవస్థలను మారుస్తారు.
ఎందుకు ఈ పదవికి డిమాండ్? గతంలో కంపెనీల దృష్టి కేవలం వాటాదారుల సంతృప్తిపైనే ఉండేది. కానీ 2019లో యూఎస్ బిజినెస్ రౌండ్‌టేబు జారీ చేసిన ప్రకటన ప్రకారం.. కంపెనీలు వాటాదారులతో పాటు భాగస్వాములందరి ప్రయోజనాలను చూడాలి. ఏఐ, ఆర్థిక మార్పుల యుగంలో ప్రజలు కేవలం లాభాలే కోరుకోవడం లేదు, కాబట్టి కంపెనీలు తమ ఉద్దేశ్యాన్ని నిరూపించుకోవాల్సిన ఒత్తిడి పెరిగింది. భారతదేశంలో 2017లో రోష్ ఫార్మా ఇండియా లారా యుమి సుజి బెజెర్రాను తొలి CPOగా నియమించి. విభాగాల మధ్య సమన్వయం సాధించడం ద్వారా ఈ మార్పుకు శ్రీకారం చుట్టింది.
అర్హతలు, జీతం: CPO కావాలంటే వ్యాపారం, మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సోషల్ ఇన్నోవేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండటం అదనపు బలం. సంబంధిత రంగాల్లో కనీసం 5 ఏళ్ల నాయకత్వ అనుభవం, వ్యూహాత్మక ప్రణాళికల్లో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో కాకుండా, ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ఫర్మ్స్ లేదా లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ ద్వారా పొందుతుంటారు. వీరు నేరుగా సీఈఓకు నివేదించాల్సి ఉంటుంది. జీతం విషయానికొస్తే, జిప్రిక్రూటర్ డేటా ప్రకారం జూన్ 2026 నాటికి అమెరికాలో CPO సగటు వార్షిక వేతనం దాదాపు రూ. 1.4 కోట్లుగా ఉంది. కంపెనీ పరిమాణం, అనుభవాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.