
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
'బాలకృష్ణకు సినిమాల్లో చప్పట్లు వినిపించేవి.. కానీ ఇప్పుడు ప్రజాసేవకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బాలకృష్ణ ఉంటారు. ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు సేవలు అందించిన ఘనత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కి దక్కుతుంది. ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీకి ఒక కారణం ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. కానీ ఆమె మా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవారు. క్యాన్సర్ అప్పట్లో డబ్బున్న వారికే వచ్చేది.. రాచపుండు అనే వారు. అమెరికాకు కూడా తీసుకెళ్లి చికిత్స చేయించాం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ఆమె మా నుంచి దూరమయ్యారు' అని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. 'ఆమెను చూసిన ఎన్టీఆర్ పేదలకు చికిత్స అందించేందుకు ఒక ఆస్పత్రి ఉండాలని భావించి కొన్ని ఎకరాల భూమిని కేటాయించి కట్టించాలనే ధృడ నిశ్చయంతో ముందుకువెళ్లారని చెప్పారు. 'ముఖ్యమంత్రిగా ఓడిపోవడం. అనంతరం ఆస్పత్రిని పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాం. ఎట్టకేలకు అప్పటి పీఎం వాజ్‌పేయి ప్రారంభించారు' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'తండ్రి ఒక మొక్క నాటితే దాన్ని ఒక గొప్ప కల్పవృక్షం లా మార్చిన ఘనత బాలకృష్ణకి దక్కుతుంది. 25 ఏళ్లలో ఎంతోమంది దాతలు ఆస్పత్రి కోసం పనిచేశారు' అని తెలిపారు.
'మాకు ఆస్పత్రిని నడపడానికి ఎన్నో సవాళ్లు వచ్చాయి. బాలకృష్ణ సారథ్యంలో 16 ఏళ్లుగా అన్స్టపబుల్గా నడుపుతున్నారు. ఈ పాటికి రిటైర్ అవుతారు. కానీ స్టిల్ హీరోగా రాణిస్తూ హిందూపూర్ ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. బాలకృష్ణకు ప్యాషన్ ఉంది. ఎంపతీ ఉంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. ఒక ప్రవైట్ ఆర్గనైజేషన్ పెడితే కూడా ఇంతలా కష్టపడరు.. కానీ నాన్ ప్రొఫిటబుల్ ఆర్గనైజేషన్ కోసం బాలకృష్ణ దేశవిదేశాల్లో తిరిగి దాతలను పట్టుకుని ఆస్పత్రిని నిలబెడుతున్నారని చెప్పారు. ఈ ఆస్పత్రికి వచ్చే ప్రతి పేషంట్‌కి భరోసా కల్పించేలా సేవలు అందిస్తున్నారు. 1,600 పైగా క్యాన్సర్ ప్రివెంటివ్ స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టారు. అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి పెడతాము అంటే స్వాగతించా' అని చంద్రబాబు వివరించారు.
'ప్రతి ఏడాది 9 లక్షల మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దీన్ని మనం ఆలోచించాలి. ఎంత ధైర్యంగా ఉన్నా కుటుంబంలో అయినా సరే క్యాన్సర్ వస్తే మొత్తం కుంగిపోతారు. మనం ముందుగా గుర్తిస్తే కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. సమైకే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్ని ప్రభుత్వాలు, విడిపోయాక కూడా అన్ని ప్రభుత్వాలు బసవతారకం ఆస్పత్రికి బాసటగా ఉన్నారు' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'ప్రైవేట్‌లో లాభాపేక్ష ఉంది. కానీ బసవతారకం ఆస్పత్రిలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్లు రావాలి. ఎన్టీఆర్ వేసిన పునాదులు.. ఒకవైపు బాలకృష్ణ సినిమాలు. నా భార్య ఎన్టీఆర్ ట్రస్ట్. పిల్లలు, హెరిటేజ్, మొత్తం సేవలు అందిస్తున్న కుటుంబం. భారతదేశంలోనే నెంబర్ 1 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా నిలుస్తుంది. బెస్ట్ ప్లాట్‌ఫారంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిలుస్తుంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.