
ఇరు దేశాల ఉగ్ర నైజాన్ని ఎండగట్టిన అమెరికా సెనేటర్లు ఈటీవీ భారత్: ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, ఖతార్‌లపై రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ...
ఇరు దేశాల ఉగ్ర నైజాన్ని ఎండగట్టిన అమెరికా సెనేటర్లు
ఈటీవీ భారత్: ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, ఖతార్‌లపై రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్, ఖతార్‌లు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతో పాటు నిధులు సమకూర్చాయని విమర్శించారు. అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థాన్ దశాబ్దం పాటు ఆశ్రయం కల్పించిందని పేర్కొన్నారు. పాక్ ఆర్మీ చీఫ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు కురిపించిన కొన్ని గంటల్లోనే సొంత పార్టీ ఎంపీలు ఈ విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో.. ‘‘ఇప్పటికైనా అమెరికాకు నిజమైన మిత్రులు ఎవరో అందరికీ స్పష్టంగా అర్థం కావాలి. పాకిస్థాన్, ఖతార్‌కు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఉంది. ప్రస్తుతం అవి శాంతి కంటే, దశాబ్దాలుగా ఇరాన్లో కొనసాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.