మహాలక్ష్మీకి హాస్టల్లో ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే పెద్ది ఇస్తాడు. బయటి లోకం తెలీకుండా పెరిగింది.. కాస్త జాగ్రత్తగా చూసుకోండని వార్డెన్‌కి, దివ్యకి చెబుతాడు పెద్ది. ఇక పెద్ది వెళ్లిపోతూ ఉంటే..
మహా అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పెద్ది సైతం మహాని తల్చుకుంటూ బయటకు వెళ్తుంటాడు. ఇక ఇంతలో పెద్ది అని పిలుస్తుంది మహా. ఎందుకు ఏడుస్తున్నావ్ పెద్ది అని మహా అడుగుతుంది. పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు నాన్న, అన్న ఎందుకు ఏడుస్తారు.. ఆత్మ బంధువు దూరం అవుతున్నప్పుడు గుండె చెరువు అవుతుంది.. ఎందుకు.. ఇది బంధమో, అనుబంధమో, ఆత్మీయతో ఎవరికి తెలుసు.. మా అమ్మని దూరం చేయొద్దు అని మీ నాన్నతో చెప్పా.. కానీ ఇప్పుడు నేనే నిన్ను వదిలేసి వెళ్తున్నా.. మాట తప్పి వెళ్లిపోతోన్నా.. పెంచడం చేతకాలేదు.. అమ్మ ఉంటే.. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలిసేది.. నేను ఎక్కడ గీత గీయలేదు.. నువ్వు గీసిన గీత వాడు చెరిపేశాడు.. వాడు చెడ్డ వాడు కాదు.. మందు తాగడం వల్ల మనసు చెదిరింది.. మేం గుర్తొస్తే.. ఎప్పుడూ తప్పుగా అనుకోకు.. అని ఇలా మహాతో పెద్ది ఎమోషనల్‌గా మాట్లాడతాడు.నేను పరాయి వాడ్ని కాదు.. నీకు బాధ వస్తే మమ్మల్ని గుర్తుకు తెచ్చుకో.. అది నీ ఇల్లు.. ఎప్పుడైనా రావొచ్చు.. జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి వెళ్లిపోబోతోంటాడు పెద్ది. మళ్లీ వెనక్కి తిరిగి.. ఇది ఆదుర్తానో, అప్పగింతలో తెలీదు.. ఇక్కడ ఎవ్వరినీ అంత సులభంగా నమ్మకు.. నమ్మి రాత్రి పూట బయటకు వెళ్లొద్దు.. ఆఫీసులో లేట్ అయితే.. నీ ఫ్రెండ్‌తో జాగ్రత్తగా తిరిగి రా.. ఏమైనా ఎదురైతే ధైర్యంగా ఎదుర్కో.. అందరితో బాగుండు.. శత్రువుల్ని చేసుకోకు.. ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో.. అని పెద్ది అంటాడు. నా దగ్గర ఉన్నాయి.. అని మహా అంటుంది. ఉండే హాస్టల్లో సగమే ఎందుకు కట్టావ్.. నేను పరాయి వాడ్ని కాదు.. నీకు అవసరం పడితే ఇంకా అడుగు.. అని పెద్ది అంటాడు.రెండుసార్లే ఏడ్చా.. రెండో సార్లు గుండె పగిలేలా ఏడ్చా.. పోలీస్ స్టేషన్లో మా నాన్నని విడిచి వచ్చినప్పుడు.. మళ్లీ ఇప్పుడు.. వీలైతే నన్ను క్షమించండి అని పెద్దితో మహా అంటుంది. మరో వైపు కన్నా గాడు మహా కోసం వెక్కి వెక్కి ఏడ్చేస్తుంటాడు. నారాయణ రావడంతో కాలర్ పట్టుకుని కడిగి పారేస్తాడు చక్రి. నువ్వు ఇచ్చిన సలహా వల్లే మహా ఈ ఇంట్లోంచి వెళ్లిపోయింది.. నీ మాటలు నమ్మే ఆ గదిలోకి వెళ్లా.. ఇప్పుడు ఆమె హాస్టల్లో చేరిపోయింది.. అని చక్రి అంటుంది. మహా వెళ్లిపోయిందా? మీరు ఆపలేదా? చూస్తూ ఊరుకున్నారా? సిటీలో ఎక్కడ? ఎలా? ఉంటుంది? అని నారాయణ అడుగుతాడు.కర్రతో కొట్టబోయిన చక్రి.. లేనిపోనివి అన్ని చెప్పావ్.. నేను అలా చేశా.. లాగి తంతే నేను రూంలో పడ్డాను.. ఆమె హాస్టల్లో పడింది.. అని చక్రి అంటాడు. ఛీ ఏం మొగాడివిరా.. తాగొచ్చి బెదరగొట్టావ్.. నేను అలా చేయమని చెప్పానా? అని నారాయణ అంటాడు. నేను అసలే మంటలో ఉన్నా.. రెచ్చగొట్టకు.. అని చక్రి అంటాడు. నువ్వు చేసిన పనికి ఇన్నాళ్లు ఆమె ఉండటమే ఎక్కువ అని నారాయణ అంటాడు. నారాయణను చక్రి కర్రతో కొట్టబోతోంటే కేశవ వచ్చి ఆపుతాడు. మహాలక్ష్మీ వెళ్లిపోయింది ఇక తిరిగి రాదు.. పెళ్లి, తాళి, మన ఇల్లు, మన రిలేషన్ అంతా మాయలో మాయమైంది అని చక్రి బాధపడుతుంటాడు.బాధపడ్డ నారాయణ.. వాడ్ని ఏమీ అనకు.. వాడు చేసిన దానికి వాడే అనుభవిస్తున్నాడు.. అని నారాయణతో కేశవ అంటాడు. అయిపోయింది రా.. బృందావనం మళ్లీ చీకటి అయిపోతుంది.. అని నారాయణ బాధపడుతుంటాడు. చక్రి, కేశవ, కన్నా, నారాయణ తలో దిక్కున కూర్చుని బాధ పడుతుంటారు. పెద్ది రావడంతో వదిన వచ్చిందని కన్నా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. గట్టి నిర్ణయం తీసుకుని వెళ్లింది.. నువ్వే తీసుకు వస్తావ్ అని అనుకుంటే.. వదిలేసి వచ్చావా అన్నయ్య అని చక్రి అంటాడు. ఏం చెప్పి తీసుకు రావాలి.. నా తమ్ముడు ఇంకో సారి తాగి రాడు అని కాగితం మీద రాసి ఇవ్వాలా?నేనేం తప్పు చేశా.. ఇంకోసారి గదిలోకి వెళ్లి గడియ వేయడని ప్రమాణం చేయాలా? అని పెద్ది అంటాడు. నువ్వు గట్టిగా ఉండమని చెప్తే ఉండేది కదా అన్నయ్య అని కన్నా అంటాడు. వీడి మనసులో రకరకాల ఆలోచనలు, కోరికలు వస్తున్నాయి.. ఉండనివ్వమని నాకే అనిపించలేదు.. మహా మన ఇంటికి వచ్చాక.. మన గురించి తప్పుగా మాట్లాడటం మానేశారు.. నీ మూలంగా మళ్లీ మన పరిస్థితి మొదటికి వచ్చింది.. ఇదేనా నేను నిన్ను పెంచిన విధానం.. నేను నిన్ను సరిగ్గా పెంచలేదు.. నువ్వు పెంచిన, నేను పెరిగిన విధానంలో తప్పు లేదు.. నేనేం తప్పు చేశా.. ఒక రాకుమారిని చూసుకున్నట్టుగా చూశా.. తప్పుడు దృష్టితో చూశానా?తాగి వెళ్లడం ఒక్కటే తప్పు.. ఆమె రాత్రి పూట తాకను కూడా తాకలేదు.. బెడ్డు మీద కూర్చోలేదు.. అత్యాచారం చేసినట్టుగా భయంకరంగా చిత్రీకరిస్తున్నారు ఎందుకు.. తాగి వెళ్లడం ఒక్కటే తప్పు.. మీరు నమ్మండి.. నమ్మకపోండి.. తనంతట తాను.. నన్ను భర్తగా అనుకునే వరకు నేను తాకేవాడ్ని కాదు అని చెప్పి వెళ్లిపోతాడు చక్రి. తాగొచ్చి చక్రి చేసిందంగా మహా గుర్తు చేసుకుంటుంది. ఇక రూంలోకి వెళ్లి మహా ఉన్న క్షణాల్ని గుర్తు చేసుకుంటాడు చక్రి. వెళ్లి పోయి మంచి పని చేశారు.. నా గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నారు.. అని చక్రి బాధపడుతుంటాడు.ఇంకేదైనా శిక్ష వేస్తే బాగుండు కదా.. మీ ఇంటికి డ్రైవర్‌గా వచ్చినప్పటి నుంచి నా మనసు చలించిందే తప్పా.. నా చూపు ఏనాడైనా చలించిందా? తప్పుడు దృష్టితో చూసినట్టు మీకు అనిపించిందా? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది.. మీ జీవితానికి కాపలాగా ఉంటానని చెప్పి.. మిమ్మల్ని తాకుతానా? అసహ్యించుకుని వెళ్లారు.. ఇంకేదైనా శిక్ష వేస్తే బాగుండు కదా.. చాచి పెట్టి కొట్టినా, తిట్టినా బాగుండేది కదా? అని చక్రి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక పెద్ది, కన్నా సైతం నిద్రపోకుండా మహా గురించే ఆలోచిస్తుంటారు. ఆ గదికి కాపలాగా ఉన్నానని అనుకున్నా.. కానీ అమ్మాయికి కాపలా ఉండాలని తెలీదు.. హాస్టల్లో మహా.. తెలిసేలోపు.. అమ్మాయి వెళ్లిపోయింది.. మన ఉద్యోగాలు పోయాయి అని పెద్ది అంటాడు. ఇదంతా కూడా చక్రి అన్నయ్య వల్లే జరిగిందని కన్నా అంటాడు. మహాలక్ష్మీ వెళ్లడం మన కంటే వాడికే నరకం.. వీలైతే వాడ్ని ఓదార్చాలి.. కానీ మరింత నరకంలోకి నెట్టేయొద్దు అని కన్నాతో పెద్ది అంటాడు. మరో వైపు మహా ఆ ఇంటితో ఉన్న మధురమైన క్షణాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కన్నా, కేశవ, నారాయణలను ఏడ్పించిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నారాయణ కూడా మహా ఉందన్న ఆలోచనల్లోనే ఉండిపోతాడు. ఉదయాన్నే మహా నిద్ర లేచి ఫ్రెష్ అయి దివ్యతో కలిసి కాఫీ, టిఫిన్‌కు వెళ్తుంది.మహాకి నచ్చజెప్పే ప్రయత్నం.. లోపల మా అమ్మాయి ఉందని నారాయణ హాస్టల్ వద్దకు వస్తాడు. నారాయణను మహా చూస్తుంది. ఎందుకు వచ్చేశావ్.. బిడీలు ఆపడం లేదు.. తిట్టేవారు లేరు.. ఊడ్చేవారు లేరు.. ముగ్గు పెట్టేవారు లేరు.. ఒక్కడి పెదాల మీద నవ్వు లేదు.. దీపం పెట్టే దిక్కు లేదు.. నీతో పాటు వచ్చిన కళ నీతో పాటే వెళ్లిపోయింది.. అమ్మ అలిగి వెళ్లిపోతుందా?.. ఇక్కడ అన్ని మంచి సౌకర్యాలే ఉన్నాయేమో.. కానీ నాకేం నచ్చలేదు.. నువ్వు తిట్టడానికి, తిడితే పడటానికి ఒక మనిషి ఉన్నాడా?.. ఇక్కడ మీ పెద్ది, కన్నా, నారాయణ ఉన్నారా? అని నారాయణ నిలదీస్తాడు.నేనే కారణం.. చక్రి చిన్న పిల్లాడు కాదు.. నేను గీసిన గీతను చెరిపేశాడు.. ఛీ నాకు అసలు అది గుర్తు చేసుకోవాలనే లేదు.. అని మహా అంటుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి, విన్నాక నన్ను తిట్టకూడదు.. కొట్టకూడదు.. అని నారాయణ అంటాడు. నిజానికి.. చక్రి గాడు అలా ప్రవర్తించడానికి ఒక విధంగా నేనే కారణం.. అని నారాయణ చెప్పడంతో మహా ఫైర్ అవుతుంది. నా గదిలోకి వెళ్లమని చెప్పింది మీరేనా? అని నారాయణ మీద ఆగ్రహంగా చూస్తుంది మహా. పూర్తిగా వింటే నీకే అర్థం అవుతుంది తల్లి అని నారాయణ అంటాడు. పిచ్చి పిచ్చిగా తిట్టిన మహా.. నేను రెచ్చగొట్టే సరికి గీత దాటాడు అని నారాయణ అంటాడు. మీరు ఎందుకు రెచ్చగొట్టారు..అని మహా అడుగుతుంది. నువ్వు మళ్లీ మాకు దూరం అవుతావేమో అని.. నీకంటే మంచి భార్య వాడికి దొరకదు.. అందుకే నీ మనసులో స్థానం సంపాదించుకో అని చెప్పా.. వాడు తాగొచ్చి.. తప్పుగా అర్థం చేసుకుని నీ రూంలోకి వచ్చాడు.. అని నారాయణ అంటాడు. నేను అతడ్ని నా రూంలోకి, నా జీవితంలోకి ఎలా రానిస్తాను అని మహా అంటూ నారాయణను పిచ్చి పిచ్చిగా తిట్టేస్తుంటుంది. ఆ తిట్లు భరించలేక నారాయణ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బాగా చదువుకుని సంస్కారం నేర్చుకో మరో వైపు కాలేజికి వెళ్తూ వదిన పెన్ను ఎక్కడా అని కన్నా అడిగేస్తాడు. మీ వదిన లేదు అని చక్రి అంటే.. అవును కదా.. ఆ విషయం జీర్ణించుకోడానికి నాకే టైం పట్టేలా ఉంది అని కన్నా అంటాడు. ఇంతలో పెన్ను ఇస్తాడు కేశవ. నువ్వు అయినా బాగా చదువుకుని సంస్కారం నేర్చుకో అని చక్రికి కౌంటర్లుగా కన్నాతో కేశవ చెప్తాడు. నీ బైక్ ఇవ్వరా.. వాడ్ని డ్రాప్ చేసి వస్తా అని చక్రి అంటాడు. మధ్యలోనే నీకు ఏదైనా గుర్తుకు వస్తే.. వదిలేస్తావ్.. నువ్వేం డ్రాప్ చేయాల్సిన పని లేదు అని చక్రితో కన్నా అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.