
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
New Cabinet Ministers : కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు మూడోసారి ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రవర్గంలో కొందరిని తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవి కాలం ముగిసినా.. వారిని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయలేదు. ఈ నేపథ్యంలో రవ్నత్ సింగ్ బిట్టూ రాజ్యసభ పదవి కాలం ముగిసింది. అటు కేంద్ర మైనార్టీ వ్యవహారల మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు బిట్టూ రాజ్యసభ పదవి కాలం ఈ నెల21న ముగిసింది. త్వరలో బిట్టూ తన రాజీనామా సమర్పించనున్నారు. వారిని పార్టీ సేవల కోసం ఉపయోగించుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు కేంద్ర క్యాబినేట్లో కీలకంగా ఉన్న కొందరు మంత్రులను తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని నరేంద్ర మోడీా క్యాబినెట్ లో భారీగా మార్పులు జరుగుతాయని తెలుస్తుంది. ఈ విషయమై ప్రధాని మోబా రాష్ట్రపతి మురుముతో నిన్న సమావేశం అయ్యారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. అయితే.. టాప్‌లో ఉన్న ఆర్ధిక, విదేశాంగ, హోం, రక్షణ శాఖ మంత్రులు కాకుండా ఇతర కేంద్ర క్యాబినేట్ మంత్రులను వేరే శాఖ కేటాయించడమో.. లేకపోతో ఉద్వాసన పలకడమో చేయనున్నారు. అంతేకాదు కొంత మంత్రులు వారి పనితీరు ఆధారంగా వారని క్యాబినేట్లో కొనసాగించడమో.. లేకపోతే మంత్రి వర్గం నుంచి తొలిగించి పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు దక్కే మంత్రి పదవులు.. ఈసారి కేంద్ర క్యాబినేట్లో తెలుగు రాష్ట్రాలకు మరిన్ని బెర్తులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణకు మహిళా కోటాలో మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు సమాచారం. అటు ఏపీ నుంచి మాజీ అధ్యక్షురాలు పురంధశ్వరిని కేంద్ర క్యాబినేట్లో తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మహారాష్ట్ర, యూపీ, ఒడిసా నుంచి ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. అటు పశ్చిమ బెంగాల్ ఎంపీలకు కూడా ఈ సారి క్యాబినేట్ విస్తరణలో చోటు కల్పింబచోతున్నట్టు సమాచారం. ఇక కేంద్ర రవాణ రహదారులు కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రను గత నెలల్లోనే ఢిల్లీ బిజెపిఅధ్యక్షుడిగా నియమించారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి చాలా కాలం క్రితమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రబిజెపి బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గంలో మరికొందరికి కూడా ఉద్వాసం తప్పదనిచాలా మంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తారనే చర్చ కూడా జరుగుతుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోపే కేంద్ర క్యాబినేట్ పున:వ్యవస్థీకరణ చేసి పలు కీలక బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపు చేసుకోవాలనే ఆలోచనలో కేంద్రం ఉంది.
ముఖ్యంగా మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లును 135వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు సమాచారం. అంతేకాదు గత స్పెషల్ సెషన్లో ప్రతిపక్షాలు కోరిన విధంగా బిల్లులో పలు మార్పులు చేర్పలు చేసి కొత్తగా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఈ రోజు జరిగే కేంద్ర క్యాబినేట్ సమావేశంలో వర్షాకాల సమావేశాలపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. వాటిని పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపచేసుకోనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 3/4 వంతు మెజారిటీకి కాస్త తక్కువ సీట్లు ఉన్నా.. కీలక బిల్లుల ఆమోదానికి ఈ లెక్క సరిపోతుందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎటొచ్చి లోక్‌సభలో డీఎంకే, తృణమూల్ తిరుగుబాటు ఎంపీల సహాకారంతో కీలక బిల్లు ఆమోదించుకోవాలనే యోచనలో కేంద్రం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.