
Moon Transit In Libra 2026: పవర్ఫుల్ చంద్రుడిని ప్రభావంతో జూన్ 24వ తేది నుంచి రెండు రోజుల వరకు కొన్ని రాశులవారికి చాలా అద్బుతంగా ఉంటుంది.
ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
Moon Transit In Libra 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రుడిని మనస్సుతో పాటు ఆనందం, ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. ఇదిలా ఉంటే ఈ గ్రహం ఈ రోజు రాశి సంచారం చేసింది. జూన్ 24వ తేదిన అర్ధరాత్రి 12:52 గంటలకు తులారాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం జూన్ 26వ తేది వరకు అదే రాశిలో కొనసాగుతూ ఉంటాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
చంద్రుడు జూన్ 26వ తేది వరకు నాలుగు రాశులవారికి అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అదృష్టాన్ని పెంచి.. అద్భుతమైన ధన లాభాలను అందిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ కింది రాశులవారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయంగా కూడా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి.
చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించడం కర్కాటక రాశివారికి ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మానసిక ప్రశాంతత విపరీతంగా లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఊహించని స్థాయిలో అందుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి.
చంద్రుడి ప్రభావంతో తులా రాశివారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి పెండింగ్‌లో ఉన్న ప్రతి పని నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు పెద్ద అధికారుల సపోర్ట్ లభించి.. అద్భుతమైన సమయాన్ని కూడా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
శక్తివంతమైన చంద్రుడి ప్రభావంతో వృశ్చిక రాశివారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో తప్పకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. వీరు చేసే ప్రతి పనిలో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా గొప్ప పురోగతి కూడా భిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి విశేషమైన గుర్తింపు కూడా అందుతుంది..
శక్తివంతమైన చంద్రుడి ఎఫెక్ట్‌తో మీన రాశివారికి కూడా ఈ సమయం ఎంలో లాభదాయంగా ఉంటుంది. వృత్తి జీవితంలో ఊహించని విజయాలు కూడా సాధిస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.