
అక్రమ వలసదారులను వెంటనే బహిష్కరించొచ్చు అమెరికా ప్రభుత్వానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ వాషింగ్టన్: అక్రమ వలసదారులు పట్టుబడిన వెంటనే దేశం నుంచి బహిష్కరించే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించవచ్చని...
అక్రమ వలసదారులను వెంటనే బహిష్కరించొచ్చు అమెరికా ప్రభుత్వానికి కోర్టు గ్రీన్ సిగ్నల్
వాషింగ్టన్: అక్రమ వలసదారులు పట్టుబడిన వెంటనే దేశం నుంచి బహిష్కరించే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించవచ్చని అమెరికాలోని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ఈ తీర్పుతో అమెరికాలో ఎక్కడ వలసదారులు సరైన పత్రాలు లేకుండా పట్టుబడినా వారిని వెంటనే బహిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. కింది కోర్టు ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలివ్వగా ఆ తీర్పును తాజాగా డిస్ట్రిక్స్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్స్ అప్పీల్ కోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పును అధికార రిపబ్లిక్ పార్టీకి కీలకమైన విజయంగా పలువురు అభివర్ణించారు.
దిల్లీ: తాత్కాలిక అవగాహన ఒప్పందం పై అమెరికా, ఇరాన్ ఈ నెల 17న సంతకాలు చేసినప్పటి నుంచీ.. 11 నౌకలు భారత్‌కు వస్తూ హర్మూజ్‌ను దాటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాటిలో మూడు భారత పతాకంతో వస్తున్న ముడిచమురు ట్యాంకర్లు ఉన్నాయని పేర్కొంది.
తైవాన్ జలసంధిలోకి చైనా కొత్త విమానవాహక నౌక
తైపీ: చైనా తన కొత్త విమానవాహక నౌక ఫుజియాన్‌ను మంగళవారం తైవాన్ జలసంధిలోకి పంపింది. ఐదు రోజుల యుద్ధవిన్యాసాలను తైవాన్ ప్రారంభించిన మరుసటి రోజే ఈ చర్యను చేపట్టడం గమనార్హం. చైనా వద్ద మొత్తం మూడు విమానవాహక నౌకలు ఉండగా.. అందులో.. ఫుజియాన్ శక్తిమంతమైంది. తైవాన్ జలసంధి.. చైనాకు, తైవాన్‌కు మధ్య ఉన్న సన్నటి సముద్ర మార్గం. తైవాన్ ప్రస్తుతం స్వయంపాలనలో ఉంది. అయితే అది పూర్తిగా తన భూభాగమేనని డ్రాగన్ వాదిస్తోంది. బలప్రయోగం ద్వారా ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకుంటానని హెచ్చరిస్తోంది. తరచూ తైవాన్ వైపు యుద్ధవిమానాలను పంపుతోంది. చైనా దురాక్రమణను తిప్పికొట్టడంపై సన్నద్ధమయ్యేందుకు తైవాన్ యుద్ధవిన్యాసాలను నిర్వహిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.