
Today Horoscope June 24 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, జేష్ట మాసం, గ్రీష్మరుతువు, 2026 జూన్ 24 బుధవారం, ఉత్తరాయణం, దశపాపహరదశమి.
పండితుల మాటల ప్రకారం ఈరోజు ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు కొత్త పనులు మొదలుపెట్టకూడదు? ఆ పూర్తి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
మేష రాశి వారికి ఈరోజు అంతా శుభమే, అన్ని విధాలా కలిసి వస్తుంది. వర్క్ ప్లేస్లో మంచి ప్రశంసలు అందుతారు, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాదు, బిజినెస్ కూడా కలిసి వస్తుంది. మేష రాశి వారు ఈరోజు ఫ్యామిలీలో సఖ్యత పెంచుకోవడానికి ట్రై చేయండి.
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, ఏ పనైనా చేసే ముందు కాస్త నిదానంగా ఆలోచిస్తే సరైన పరిష్కారం దొరుకుతుంది. మిధున రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, అందుకే కొత్త పనులు మొదలుపెట్టకండి.
కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. కొత్త డ్రెస్సులు కొనకండి, ఫ్యామిలీలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి, లేదంటే అనవసర ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ మెడిటేషన్ వంటివి చేయండి.
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగానే ఉంటుంది, అంతా కలిసి వస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బిజినెస్ చేసే వారికి కూడా ఈరోజు కలిసి వస్తుంది. ఫ్యామిలీలో సఖ్యత పెరుగుతుంది, కానీ కాస్త స్ట్రెస్ తగ్గించుకోవడం మంచిది.
ధనస్సు రాశి వారికి కూడా ఈరోజు చాలా బాగుంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది, కొత్త వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)