
తొమ్మిదేళ్ల వయసులో తన అన్నయ్య ఆట చూసి సరదాగా బ్యాట్ పట్టిన ఆ యువతి.. నేడు దేశం గర్వించేలా భారత్ అండర్ -19 జట్టులో స్థానం సంపాదించుకుంది.
కఠోర శ్రమ, పట్టుదలతో గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆమే హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్ష. మూడేళ్లుగా ఓ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటూ మెళకువలు నేర్చుకున్న ఆమె. ఇటీవల మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్లో జమ్మూకశ్మీర్‌పై మంచి ఇన్నింగ్స్ చేసింది. అది సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. దేశవాళీ క్రికెట్లోనూ ప్రతీక్ష నిలకడగా రాణించడంతో శ్రీలంక పర్యటన, మహిళల అండర్-19 వన్డే జట్టులో స్థానం దక్కింది. మొదట్లో సరదాగా ఆడినా.. క్రమంగా రాణించి క్రికెట్‌నే కెరీర్‌గా మార్చుకుంటున్న ప్రతీక్షపై ప్రత్యేక కథనం.. ఈ వార్త చదివారా: ఫుడ్ ఆస్కార్ గెలుచుకున్నా!