
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Redmi Note 17 Series Leak News: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి (Xiaomi) సబ్‌బ్రాండ్ రెడ్మికి మంచి గుర్తింపు ఉంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్బుతమైన డిజైన్‌తో మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తుంది. అతి త్వరలోనే కంపెనీ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కళ్లు చెదిరే బ్యాటరీ బ్యాకప్‌ను అందించేందుకు సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ రెడ్మి నోట్ 17 (Redmi Note 17) సిరీస్ పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలు కూడా లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రెడ్మి చరిత్రలోనే అతిపెద్ద బ్యాటరీ.. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించి సమాచారం ప్రకారం.. రెడ్మి చైనా మార్కెట్లో ఒక సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ప్లాన్ చేసేందుకు సిద్ధమైందని.. ఇది ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేయబోతోందని తెలిపింది.. ఒకవేళ ఇదే నిజమైతే.. రెడ్మి మొబైల్స్ చరిత్రలోనే ఇంతటి భారీ బ్యాటరీతో రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుందని పేర్కొన్నారు.
కళ్లు చెదిరే డిస్ప్లే.. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిస్ల్పేకి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఫ్లాట్ 1.5K రెజల్యూషన్ కలిగిన హై-క్వాలిటీ డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది.. మల్టీమీడియా ప్రియుల కోసం ఇందులో హై-వాల్యూమ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో సినిమాలు, గేమింగ్ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుందని సమాచారం.
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.. Redmi Note 17 సిరీస్ ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6-సిరీస్ (Qualcomm Snapdragon 6-series) ప్రాసెసర్‌ను వినియోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్సెట్తో రావచ్చని టెక్ నిపుణులు అంచానాలు వేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ అత్యంత ధృడంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్లాగ్షిప్ స్థాయి వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో పాటు కింద పడినా పగలకుండా ఉండేలా మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్ ఫీచర్లను ఇందులో కంపెనీ అందిస్తోంది..
10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. కొన్ని కంపెనీలు గతంలో కేవలం 9,000mAh బ్యాటరీ మాత్రమే అందించాయి. కానీ ఈ సిరీస్‌లో రెడ్మి నోట్ 17 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం లుక్ కోసం మెటల్ ఫ్రేమ్‌తో పాటు అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనున్నట్లు ఇతర లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి..
లాంచ్ ఎప్పుడంటే? ఈ రెడ్మి నోట్ 17 లైన్అప్ ఇప్పటికే యురేషియన్ ఎకనామిక్ కమిషన్ (EEC)తో పాటు GSMA డేటాబేస్‌లలో కనిపించిన సంగతి తెలిసిందే... దీనిని బట్టి చూస్తే మొదటగా చైనాలో అధికారికంగా విడుదలైన కొన్ని నెలలకే ఈ సిరీస్ గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.