
అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కీపన్యూర్ జిల్లాలో మెరుపు వరదలు ముంచెత్తాయి.
యాజాలి సర్కిల్ పరిధిలోని పూసా సమీపంలో నీప్కో ప్రాజెక్టు కాలనీ వద్ద వరద పోటెత్తడంతో ముగ్గురు గల్లంతయ్యారు. నిర్మాణంలో ఉన్న రక్షణగోడ కూలిపోవడంతో భారీగా వరద నీరు చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవేశించింది. కనీసం 18 నివాస గృహాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వార్త చదివారా: కుప్పకూలిన గోదాం.. శిథిలాల కింద 30 మంది