
వరల్డ్ స్టార్ ప్రియాంక చోప్రా, చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలనుకునే కొత్త టాలెంట్‌కు ఇప్పుడు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ఒక మంచి ఆలోచన ఉంటే చాలు, తక్కువ బడ్జెట్తోనూ ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించవచ్చని, ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన హారర్ సినిమా 'అబ్సెషన్' దీనికి చక్కటి ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. బుధవారం కేన్స్ లయన్స్ సదస్సులో పాల్గొన్న ప్రియాంక, మారుతున్న సినిమా ప్రపంచంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అబ్సెషన్' వంటి సినిమాలతో హాలీవుడ్ హద్దులు చెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు."మీ దగ్గర ఒక ఐడియా ఉంటే, దాన్ని షూట్ చేసి యూట్యూబ్‌లో పెట్టండి. అది 'అబ్సెషన్' లాంటి పెద్ద హిట్ సినిమా కూడా కావచ్చు. వినోద రంగంలో ఉండటానికి ఇది సరైన సమయం, ఎందుకంటే ఇప్పుడు మీ ఆలోచనలే మీ ఆస్తి" అని ప్రియాంక తెలిపారు. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆమె గుర్తుచేసుకున్నారు.గత పదేళ్లుగా హాలీవుడ్లో కెరీర్ నిర్మించుకుంటున్న ప్రియాంక, తాను పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. "మా తల్లిదండ్రులు డాక్టర్లు. మాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు, ఎలా ముందుకు వెళ్లాలో కూడా అవగాహన లేదు. అప్పట్లో సినిమా అనేది కొందరికే పరిమితమైన రంగం" అని అన్నారు.తన కెరీర్ తొలినాళ్లలో భారతీయ సినిమాలు ఎప్పటికీ హాలీవుడ్ అంతటి ప్రపంచ స్థాయికి చేరలేవని చాలామంది అనేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఫిల్మ్ మేకర్స్‌ను, మంచి ఐడియాలు ఉండి అవకాశాలు రాని వారిని ప్రోత్సహించేందుకు తాను నిర్మాణ సంస్థను ప్రారంభించినట్టు వెల్లడించారు. హిందీలో ఎందరో