
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
High Court Involves In Tuni Girl Missing Case: తుని చిన్నారి మిస్సింగ్ కేసు ఇంకా క్లారిటీకి రాలేదు, పాప ఎక్కడుందో కూడా తెలియరావడం లేదు. దీనిపై ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ముఖ్యంగా, అదృశ్యమైన పిల్లల విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను పోలీసులు పాటించారా? లేదా? అని కూడా హైకోర్టు అడిగింది. పాపను కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని లాయర్ శ్రీకాంత్ పిల్ వేశారు. అయితే పాప కోసం ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసుల తరఫు లాయర్ చెబుతున్నారు. గత 15 రోజులుగా జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.. పాప క్షేమంగా తిరిగి రావాలని తెలుగు రాష్ట్రాల్లో అందరూ కోరుకుంటున్నారు. పోలీసులు ప్రతిచోటా వెతుకుతున్నా, రెండు వారాలు దాటిపోతున్నా ఇంకా ఏమీ తేలలేదు. కిడ్నాప్ చేశారా?, వన్యమృగాల దాడి జరిగిందా? లేక వేటగాళ్ల వలలో చిక్కుకుందా? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏ సమాధానం దొరకలేదు. పైగా పెంపుడు కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ కూడా రాకపోవడంతో మిస్టరీ ఇంకా పెరుగుతూనే ఉంది.
ఇంతలో ఈ కేసులో కొందరు జ్యోతిష్యుల పేరుతో వచ్చి, పూజలు చేస్తూ పాప బతికే ఉందని తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. పాప క్షేమంగా తిరిగి వస్తుందని రోజుకు ఒకరు ఇష్టం వచ్చినట్లు చెబుతుండటంతో పాప తల్లి చాలా ఇబ్బంది పడుతోంది. పోలీసులు మాత్రం తనిఖీలు చేస్తూనే ఉన్నారు.
మొదట ఆ పాపతో పాటు కుక్క కూడా ఉంది. ఈ మిస్సింగ్ కేసులో ఆ కుక్కను అందరూ కీలకమైన అంశంగా భావిస్తున్నారు. మొదట పాపతో ఉన్న ఆ కుక్క, తర్వాత ఒంటరిగా గుడి వద్ద తిరుగుతూ కనిపించింది. దానికి జిపిఎస్ ట్రాకర్ పెట్టిన కొద్దిసేపటికే అది కూడా మరణించింది. స్థానికుల ప్రకారం ఇది క్షుద్ర పూజల వల్ల కాకపోయినా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కుటుంబ కలహాల వైపు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read more: Tuni Girl Missing: తోటల్లో తిరిగే వాళ్లే ఎత్తుకెళ్లారా?
దర్యాప్తులో పురోగతి ఏది? వారాల తరబడి వెతికినా పాప జాడ దొరకకపోవడంతో, హైకోర్టు కూడా రంగంలోకి దిగింది. దర్యాప్తులో ఎంతవరకు పురోగతి ఉంది, నిబంధనలు పాటిస్తున్నారా అని పోలీసులను అడిగింది. తోట అంచున ఉన్న ఇనుప కంచె దగ్గర అనుమానాస్పదంగా కొన్ని గుర్తులు, వెంట్రుకలు కనిపించాయని పోలీసులు చెబుతున్నారు. పాపను ఎవరో కంచె అవతలి నుంచి ఎత్తుకెళ్లి ఉండొచ్చా అని కూడా అనుమానిస్తున్నారు.
అడవుల్లో మనుషుల అడుగుజాడల్లే కానీ జంతువుల అవశేషాలు ఏవీ దొరకలేదు. అటవీ సిబ్బంది దట్టమైన అడవుల్లో కూడా వెతుకుతున్నారు. అక్కడ కొండల్లో కొన్ని లోతైన గుంతలు కూడా ఉన్నాయి. పోలీసులు సంచార తెగపై కూడా అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. పాపను మొదట చూసిన తాతారావు కూడా పాపతో పాటు పెంపుడు కుక్క ఉందని చెప్పాడు. ఆ కొండ దగ్గర ఆ కుక్క పాపను కాపాడుతూ ఉందని చెప్పారు. చివరికి ఆ కుక్క ఇంటికి తిరిగి వచ్చింది కానీ పాప మాత్రం రాలేదు. పాప దగ్గరకు వెళ్తుంది అని ఆశగా జిపిఎస్ ట్రాకర్ పెట్టినప్పటికీ, కొద్దిసేపటికే ఆ కుక్క కూడా చనిపోయింది. అసలు ఈ తుని గల్ మిస్టరీ ఎప్పుడు తేలుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.