
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిట్లర్ తరహా పాలన సాగిస్తోందని, ఖమ్మం జిల్లాలో పేదల ఇళ్లను కూల్చివేస్తూ దమనకాండకు పాల్పడుతోందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేదలకు రక్షణగా నిలవాల్సింది పోయి, ల్యాండ్ గ్రాబర్గా వ్యవహరిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.రఘునాథపాలెంలో ఇళ్ల స్థలాల నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రఘునాథపాలెం పరిధిలోని సర్వే నంబర్ 218లో 625 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేసి, గృహలక్ష్మి పథకం కింద లబ్ధి చేకూర్చామని ఆయన గుర్తుచేశారు. నిరుపేదలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడితే, ప్రస్తుత ప్రభుత్వం జేసీబీలతో వాటిని కూల్చివేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన చింతకాని మండలంలో నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ'ను 'రైతుల క్షమాపణ సభ'గా మార్చుకోవాలని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రైతుబంధు చెల్లింపులు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల అంశాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గత కొంతకాలంగా రెవెన్యూ మంత్రికి వ్యతిరేకంగా భూ, మైనింగ్ సమస్యలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో హరీశ్ రావు చేసిన తాజా