
ఈ మూడు గ్రహాల కలయిక సింహ రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారి ఎక్కువ ఫోకస్ డబ్బు సంపాదించడంపై ఉంటుంది. అంతేకాదు.. ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలతో విజయం సాధిస్తారు.
కీర్తి పెంచుకుంటారు. శుక్రుడి కారణంగా విపరీతంగా డబ్బు లభిస్తుంది.ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి.
ఈ గ్రహాల కలయిక తుల రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడటానికి కొత్త మార్గాలు వెతుకుతారు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. గతంలో ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే.. అవి తగ్గిపోతాయి. పిల్లల ఎదుగుదలను కళ్లారా చూస్తారు. సంతోషం రెట్టింపు అవుతుంది.
ఈ గ్రహాల కలయిక ధనుస్సు రాశివారికి సానుకూలంగా ఉంటుంది.ఈ సమయంలో శుక్రుడి అనుగ్రహం కారణంగా ఈ రాశికి ఆరోగ్యంగా బాగా కలిసొస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. శత్రువులను ఓడిస్తారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.ప్రేమ జీవితం కూడా ఆనందంగా మారుతుంది.
ఈ గ్రహాల కలయిక వృషభ రాశివారి జీవితాన్ని స్వర్ణయుగంగా మార్చనుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే.. అవి పరిష్కారమౌతాయి. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామి తోడుగా ఉంటారు. దాని వల్ల మీకు మరింత బలం పెరుగుతుంది. అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మూడు గ్రహాల కలయిక కర్కాటక రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అన్నింట్లోనూ విజయం సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు కూడా శుభకాలం.