
శని దేవుడు జూలై 27న తన సంచారాన్ని మార్చుకోబోతున్నాడు. వక్రగతిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు.
మీన రాశిలో వక్రగతిలో సంచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మూడు రాశులపై ఎక్కువ ప్రభావం కనబడుతుంది. ఆ మూడు రాశులకు జూలై నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
శని వక్రగమనం అనేది మేష రాశి వారికి జూలై నెలలో పెద్దగా ఇబ్బందులు కలిగించదు. వీరికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఏ విషయంలోనూ లాభం, నష్టం.. రెండూ రావు. కుటుంబ సంబంధిత సమస్యలు కొంతవరకు తగ్గవచ్చు. ఇక పెళ్లయిన వారు జీవిత భాగస్వామితో బంధాన్ని బలంగా మార్చుకుంటారు. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మాత్రం జూలై నెలలో ఆ పని చేయకపోవడమే మంచిది. వీరు మానసికంగా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు.
కుంభ రాశికి అధిపతి శని. ప్రస్తుతం కుంభ రాశిలో ఏలినాటి శని చివరి దశలో ఉంది. శని వక్రగమనం వల్ల కుంభ రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో వారి మనసు కలత చెందుతుంది. అనేక రకాల ఆందోళనలు పట్టిపీడిస్తాయి. మానసికంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడవచ్చు.
మీన రాశి అధిపతి గురు గ్రహం. గురు, శని గ్రహాలు శత్రువులు కాదు.. మిత్రులు కాదు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి తటస్థంగా ఉంటాయి. కాబట్టి జూలై నెలలో మీన రాశి వారు ఎంతో ఓర్పుగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే అవి నష్టాలకు దారి తీయవచ్చు. చేసే పనిలో సవాళ్లు ఎదురవ్వచ్చు. ఆరోగ్యంలో కూడా హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఓపిగ్గా ఉంటే మంచిది.