
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Parijat raj yog lucky zodiac signs: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మానవ జీవితంలో పెనుమార్పులకు కారణమౌతాయి. అప్పటి వరకు సాధారణంగా ఉన్న వారు సైతం గొప్ప స్థానంలో చేరుకుంటారు. ఈ క్రమంలో జూన్ 24న అత్యంత అరుదైన పారిజాత యోగం ఏర్పడనుంది. ఈ రోజు దేవ గురువుతో పాటు చంద్రుడు కలయికతో పారిజాత యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులకు ఊహించని విధంగా ధనలాభంతో పాటు భారీగా రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు చేకూరనున్నాయి.
ముఖ్యంగా పారిజాత యోగం అనేది శ్రీకృష్ణుడికి సంబంధించిందని చెప్తారు. ఈ యోగం ఏర్పడిన రోజున సూర్యుడు కూడా ఉచ్చస్థితిలో ఉండటంను మరింత గొప్పదైనదిగా చెప్తున్నారు. దీని వల్ల అత్యంత లాభపడే రాశులు ఏమిటో చూద్దాం..
మిథున రాశి.. ఈ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాదనుకున్న డబ్బు వీరికి లభిస్తుంది. లాటరీలు తగులుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కన్య రాశి.. వీరికి వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి అనుకొని విధంగా ధనలాభాలు చేకూరతాయి. కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వివాదాలు పరిష్కారమౌతాయి.
తుల రాశి.. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. సర్కారు కొలువుల కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తల్ని వింటారు. పలుకు బడి కల్గిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.
ధనస్సు రాశి.. ఈ రాశి వారికి విపరీమైన లాభాలతో జ్యేష్టమాసంలో ఆదాయం సమకూరుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. భార్య తరపు ఆస్తులు వీరి సొంతమౌతాయి. కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు. జూన్ 24 నుంచి వీరు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.( గమనిక - ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)
Read more: Jyeshtha mass 2026: జ్యేష్ఠమాసంలో ఇంట్లో పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురి పెళ్లి చేయోద్దంటారు.. దీని వెనుక అసలు స్టోరీ ఏమిటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.