
హైదరాబాద్లోని కొత్తపేటలో ఎస్బీఐ కాలనీకి వెళ్లి ‘అందరి ఇల్లు’ ఎక్కడా అని అడిగితే రోడ్ నంబర్ 2లో ‘మీ సేవ’ ఎదురుగా ఉంటుందని ఎవరైనా చెబుతారు.
Jun 22 2026 2:50 PM | Updated on Jun 22 2026 3:01 PM
హైదరాబాద్లోని కొత్తపేటలో ఎస్బీఐ కాలనీకి వెళ్లి ‘అందరి ఇల్లు’ ఎక్కడా అని అడిగితే రోడ్ నంబర్ 2లో ‘మీ సేవ’ ఎదురుగా ఉంటుందని ఎవరైనా చెబుతారు. అటువైపు వెళితే గ్రౌండ్ ఫ్లోర్లో ఓ నాలుగు గదుల ఇంటికి ‘అందరి ఇల్లు’ అని బోర్డు ఉంటుంది. తలుపులు తెరిచే ఉంటాయి. లోపలికి వెళితే ఆకలిగొన్నవారు వండుకుంటూ కనబడతారు. వండింది ఉంటే తినేవారు కనిపిస్తారు. పక్కనే బియ్యం, నూనె, పప్పు, ఉప్పు, అన్ని దినుసులు ఉంటాయి. కిచెన్లో స్టవ్, వంట పాత్రలు, ప్లేట్లు ఉంటాయి. ఈ ఇంటిలోకి వచ్చినవారు వండుకొని తినడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏవి తక్కువ పడినా వెంటనే సమకూరు తాయి. అంతా ఉచితమే. మీ ఇల్లే అనుకోవచ్చు. దీనిని పిల్లల డాక్టరు వింజమూరి సూర్యప్రకాష్, గైనకాలజిస్టు సామవేదం కామేశ్వరి దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీతో అందరి ఇల్లు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.
నిరాటంకంగా సాగుతున్న ఈ అన్న వసతికి వారు ఒకరి దగ్గర చేయి చాపలేదు, తామేదో ఘనకార్యం చేస్తున్నట్లు ప్రచారాన్ని కోరుకోలేదు. ఈ భోజన వసతి గురించి తెలిసిన గ్రామీణ పేద యువత అందరి ఇల్లుకు రావడం మొదలైంది. వారిలో ఎక్కువ మంది పోటీ పరీక్షల తయారీకి ఇల్లు వదిలి వచ్చినవారని తెలుసుకొని వారికోసం మరిన్ని వసతులు కల్పించారు. 2011లో వారు చదువుకోవడానికి లైబ్రరీ, కుర్చీ బల్లలు సమకూర్చారు. రాత్రుళ్లు ఇక్కడే ఉండిపోవడానికి కొన్ని బెడ్స్ కూడా వేశారు. ఇందులో ఆరు నెలలు, ఏడాది పాటు ఉండి ఉద్యోగ ప్రయత్నం కొనసాగించినవారు ఎందరో! పై అంతస్తులో కామేశ్వరి క్లినిక్ ఉంటుంది. వైద్యం కోసం వచ్చిన పేదలకు ఆహారానికి, నివాసానికి బెంగ అక్కర లేదు. పేద మహిళలు ప్రసూతి అయ్యే దాకా ఇక్కడే గడిపిన సందర్భాలు ఉన్నాయి. సూర్యప్రకాష్ రోజు ఉదయమే స్వయంగా వచ్చి సరుకులు, సదుపాయాలు సరిపడా ఉన్నాయా అని చూసుకుంటారు.
ఈ ఆలోచన (Andari Illu) ఎలా వచ్చిందని అడిగితే ‘సృష్టిలో ప్రతి జీవికి ప్రకృతి ఏదో రూపంలో ఆహారాన్ని అందిస్తోంది. మనుషులు మాత్రమే డబ్బులు వెచ్చించి తిండిని సమకూర్చు కోవాలి. దినమంతా ఏమి తినకుండా రాత్రి గడిపేవారి పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంటుంది. అందుకే ఇలా ఆరంభించాం’ అంటారు.
ఎలాగైనా ఖాళీ కడుపు నింపాలి అనే ఆలోచన ఈ వైద్య దంపతులకు 2001లో వచ్చింది. ముందుగా తోపుడు బండిలో అరటిపండ్లు పంచడం మొదలు పెట్టారు. కొన్నాళ్ళు రాత్రి భోజనాన్ని అందించారు. ఇవేవీ తృప్తి నీయక 2006 జూన్ 15న ‘అందరి ఇల్లు’ను ఆరంభించారు. ఎలాంటి ప్రారంభోత్సవ హంగామాలు చేయకుండా స్వయంగా వారే పేదలు ఉండే అడ్డాల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. 24 గంటలు ఇక్కడ సేవలు లభిస్తాయి. తమలాగే ఎవరైనా ముందుకొస్తే ఆ ఆలోచన కార్యరూపం అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ దంపతులు చెబుతున్నారు.
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్డే స్పెషల్( ఫొటోలు)
'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు)
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
ఇన్నాళ్లు ఓపిక పట్టా.. నా వల్ల కావడం లేదు అమ్మ.. గాయత్రి చివరి ఫోన్ కాల్
తాట తీస్తా.. నా కొడకా.. పవన్, పంతం నానాజీ వ్యాఖ్యలు.. అంబటి మాస్ వార్నింగ్
పవన్ కామెంట్స్ పై పచ్చి బూతులు తిడుతున్న యువత!
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. బుడ్డోడి దెబ్బకు యువీ, ఏబీ డివిలియర్స్ రికార్డులు బద్దలు
వాహనాలు తనిఖీ చేస్తుండగా DTOపైకి దూసుకెళ్లిన లారీ