
కొత్త కథానాయిక విశాఖ ధీమన్ నటించిన రెండు సినిమాలు వచ్చే నెలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. ఆమె నటించిన 'రాజా ది రాజా' జూలై 17న వస్తుండగా, జూలై 31న 'రోమియో జూలియెట్' మూవీ రిలీజ్ కానుంది.
కొత్త హీరోయిన్లు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రావడం అంటే విశేషమే. విశాఖ ధీమన్ (Vishakha Dhiman) నటించిన రెండు సినిమాలు అలా ఒకే నెలలో రెండు వారాల గ్యాప్ తో రాబోతున్నాయి. ఆమె నటించిన 'రాజా ది రాజా' మూవీ జూలై 17న విడుదల కాబోతుండగా, 'దీవానా' ఫేమ్ హర్షిత్ రెడ్డి (Harshith Reddy) సరసన నటించిన 'రోమియో జూలియెట్' (Romeo Juliet) మూవీ జూలై 31న విడుదల కాబోతోంది.
ఇక మొదటి చిత్రానికి వస్తే... రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రాజా ది రాజా' (Raja The Raja). వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమాను అనిల్ బోయిడపు డైరెక్ట్ చేశారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. దీంతో సినిమా మరింత గ్రాండ్‌గా ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించినట్లయిందని మేకర్స్ తెలిపారు.
రిలీజ్ డేట్ పోస్టర్లో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీతో పాటు వారి సరదా ప్రయాణాన్ని హైలైట్ చేశారు. కలర్ ఫుల్ విజువల్స్, ఆకట్టుకునే డిజైన్ చిత్రంలోని రొమాంటిక్ మూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ ఉత్సాహంగా, ఎనర్జీతో కనిపిస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అనిపించేలా పోస్టర్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. రవికిరణ్ బోయిడపు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ కుమార్ పసుపులేటి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 'రాజా ది రాజా' మూవీలో ఇతర ప్రధాన పాత్రలను సాయికుమార్, డాక్టర్ నరేష్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్ తదితరులు పోషిస్తున్నారు.
అందాల భామ విశాఖ ధీమన్ నటించిన మరో సినిమా 'రోమియో జూలియెట్'. గత యేడాది 'శుభం'తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హర్షిత్ రెడ్డి నటించిన ఈ సినిమాను భార్గవ్ మాచర్ల డైరెక్ట్ చేశాడు. ఎన్. సందీప్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల నిర్మించిన ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'రోమియో జూలియట్' జెన్ జీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసింది. ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధించినా విశాఖ ధీమన్ కు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
Swetha Menon: కీలుబొమ్మను కావాలనుకోవడం లేదు..