
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ని రంగారెడ్డి జట్టు 16.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. తనయ్ త్యాగరాజన్ (71*; 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఆదిత్య జవ్వాజి (41; 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అవినాష్ రావు (22; 6 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), నితిన్ సాయి యాదవ్ (26*; 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. నల్గొండ బౌలర్లలో అనికేత్ రెడ్డి 2, వరుణ్ గౌడ్ 2, నిశాంత్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు నల్గొండ బ్యాటర్లలో ఆరో స్థానంలో వచ్చిన దివేశ్ సింగ్ (48; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో హర్షవర్థన్ సింగ్ (40; 20 బంతుల్లో) మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ రాహుల్ బుద్ధి (30), వరుణ్ గౌడ్ (26), పాట్కూరి నితీశ్ రెడ్డి (20) పరుగులు చేశారు. ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7)తోపాటు అర్ఫాన్ అహ్మద్ (7) నిరాశపర్చారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య 3, నితిన్ సాయి యాదవ్ 2, ఆర్యన్ చరియప్ప 2, తనయ్ త్యాగరాజన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket)2026లో భాగంగా సియాటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ (Rovman Powell) ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు.