
విశాఖపట్నం: ఉత్తరాఖండ్‌లోని మసూరీలో అనుమానాస్పదరీతిలో మృతిచెందిన టెకీ రాధా గాయత్రి కేసు (Radha Gayatri case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణాధికారిని డీజీపీ దీపమ్‌సేథ్ మార్పు చేశారు.
మసూరీ ఎస్‌హెచ్‌వో దేవేంద్ర చౌహాన్ ప్రవర్తనపై మృతురాలి తండ్రి సుధాకర్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎస్‌హెచ్‌వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణాధికారిగా సంపూర్ణానంద్ గైరోలాకు బాధ్యత అప్పగించారు. అల్లుడు శ్రీచరణ్‌పై అనుమానాలతో సుధాకర్ మసూరీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.